ఆరు సినిమాలు వచ్చాయి, అయినా మహేష్ రికార్డ్ సేఫ్

గత ఏడాది ఆగష్టులో వచ్చింది శ్రీమంతుడు.1-నేనొక్కడినే, ఆగడు లాంటి రెండు డిజాస్టార్ల తరువాత వచ్చినా, రికార్డు ఓపెనింగ్స్ మొదలుపెట్టి, రికార్డు టోటల్ కలెక్షన్లతో ముగించింది.ఈ సినిమా కలెక్షన్లు వంద కోట్ల పైమాటే అని కొందరు వాదిస్తే, 85-90 కోట్ల షేర్ ని రాబట్టిందని మరికొందరు చెబుతారు.ఏ లెక్కన తీసుకున్నా బాహుబలి తరువాత రెండో అతిపెద్ద హిట్ గా నిలిచింది శ్రీమంతుడు.

 6 Biggies Failed To Beat Srimanthudu-TeluguStop.com

ఇక ఆ సినిమా వచ్చిన తరువాత పెద్ద హీరోల సినిమాలు ఆరు .బ్రూస్ లీ, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు, బ్రహ్మోత్సవం, జనతా గ్యారేజ్ విడుదలయ్యాయి.వీటిలో నాన్నకు ప్రేమతో, సరైనోడు, జనతా గ్యారేజ్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోగా, మిగితా మూడు సినిమాల్ని రిజెక్ట్ చేసారు ఆడియెన్స్.

ప్రభాస్ మినిహా మిగితా అందరు టాప్ హీరోల సినిమాలు విడుదలైనా శ్రీమంతుడు రికార్డు మాత్రం బద్దలవ్వలేదు.

ఈ ఏడాది ధృవ ఒక్కటే మిగిలిపోయింది.ఈ సినిమా కూడా దాటలేకపోతే, ఖైదీ నం.150 ఒక్కటే రేసులో మిగిలిపోతుంది.అది కూడా దాటకపోతే, బాహుబలిని ఎలాగో లెక్కలోకి తీసుకోం కాబట్టి, మళ్ళీ తన రికార్డు బద్దలుకొట్టుకునే అవకాశం మహేష్ కే 23వ సినిమా రూపంలో వస్తుంది.

చూద్దాం .శ్రీమంతుడుని దాటే అగ్రహీరో ఎవరో!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube