రజినీకాంత్ – శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 2.0 (రోబో 2) రోజురోజుకి మరింత పెద్ద ప్రాజెక్టుగా తయారవుతోంది.కోట్ల రూపాయలు పెంచుకుంటూపోతున్నారు.మొదట 300 కోట్లతో మొదలుపెట్టిన ఈ సినిమా, ఆ తరువాత 350 కోట్ల సినిమాగా, ఏసియాలో రెండొవ అతిపెద్ద సినిమాగా మారింది.ఇప్పుడు ఏకంగా మరో 50 కోట్లు ఈ సినిమా బడ్జెట్ లో పెంచేసారు.అంటే 2.0 బడ్జెట్ అక్షరాల 400 కోట్లు అన్నమాట.
దీన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తారేమో అని అనుకునేరూ ! మరో మూడు భాషల్లో కూడా ఈ సినిమా రాబోతోంది.
మిగితా మూడు భాషల్లో ఏవి అనుకుంటున్నారు? ఇంగ్లీష్, చైనీస్, జపానీస్ భాషల్లోకి కూడా ఈ సినిమా డబ్ కాబోతోంది.మొత్తం మీద ఆరు భాషల్లో ఈ భారి చిత్రం విడుదల అవుతుంది.
బాహుబలిని చూసి మనం జబ్బలు చరుచుకుంటుండగానే, దాన్ని మించిన ప్రాజెక్టు తీసుకొచ్చేస్తున్నాడు శంకర్.
రజినీకాంత్ కి జోడిగా ఆమీ జాక్సన్ నటిస్తున్న ఈ సినిమాలో బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ అన్న సంగతి తెలిసిందే.పూర్తిగా 3D ఫర్మాట్ లో తెరకెక్కుతున్న 2.0 వచ్చే ఏడాది దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది.