ప్రమాదకరమైన ప్లాస్టిక్ బియ్యంని కనిపెట్టేందుకు 5 మార్గాలు

మార్కెట్లో ప్రతి వస్తువుకి ఒక నకిలీ వస్తువు దొరుకుతోంది.నోట్ల నుంచి పండ్ల దాకా, అన్ని నకిలీ చేస్తున్నారు.

 5 Ways To Identify Plastic Rice ?-TeluguStop.com

చివరకి కడుపు నింపే బియ్యాన్ని కూడా.మీరు ఈమధ్య కాలంలో వార్తల్లో చూసే ఉంటారు, నకిలీ బియ్యం, అదే ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా అమ్ముతున్నారని.

ఎలాగైతే నకిలీ నోటు చాలా శ్రద్ధగా, దీక్షగా గమనిస్తే కనిపెట్టలేమో, అలాగే ఈ ప్లాస్టిక్ బియ్యాన్ని కూడా పనిగట్టుకొని చూస్తే తప్ప కనిపెట్టలేం.అచ్చు గుద్దినట్లు పండించే బియ్యం లాగే ఉంటాయి ఈ నకిలీ బియ్యం కూడా.

ఆ బియ్యాన్ని గనుక మీరు పోరాపాటులో తింటే ఇక అంతే సంగతులు.జీర్ణవ్యవస్థ చాలావరకు దెబ్బతింటుంది.

మీ రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోతాయి.లివర్ నుంచి కిడ్నీలవరకు, అంతటా నష్టాలే.

మరి ప్లాస్టిక్ బియ్యాన్ని కనిపెట్టేది ఎలా ?

* ఈ టెక్నిక్ చాలా సింపుల్.కొంత బియ్యాన్ని తీసుకోండి.

అగ్గిపుల్ల వాడి ఆ బియ్యాన్ని అంటించండి.అది కాలిన తరువాత దాని వాసన చూడండి.

ప్లాస్టిక్ కాలిన వాసన వస్తే వెళ్లి పంపిణిదారుడిని నిలదీయండి.

* మరో దారి చెప్పాలంటే, బియ్యం ఉడికించి దాన్ని తినకుండా ఒకటి రెండు రోజులు అలాగే పెట్టండి.

పండించిన బియ్యం అయితే అన్నం కుళ్లిపోయి కంపు కొడుతుంది.అదే ప్లాస్టిక్ బియ్యం అయితే అలా జరగదు.

* నూనె తీసుకోండి, ప్యాన్ తీసుకోండి.బియ్యాన్ని వేసి ఫ్రై చేసే ప్రయత్నం చేయండి.

బియ్యం కరిగితే అది ప్లాస్టిక్ బియ్యమే.

* లేదంటే ఈ సులువైన టెక్నిక్ ప్రయత్నించండి.

బియ్యాన్ని నీటిలో వేసి బాగా కలపండి.పండించిన బియ్యం అయితే మునిగి ఉంటుంది, అదే ప్లాస్టిక్ బియ్యం అయితే తెలుతూ ఉంటుంది.

* ఏదైనా ట్రాన్స్పరెంట్ కంటేనర్ లో బియ్యాన్ని ఉడికించండి.మామూలు బియ్యం అయితే పరిస్థితి మామూలుగానే ఉంటుంది.

అదే ప్లాస్టిక్ బియ్యం అయితే పైన ఓ పోర ఏర్పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube