అందంగా కనబడటానికి అయిదు మార్గాలు-5 Simple Ways To Look Beautiful 1 month

Beautiful Without Makeup Beauty Tips Drink Water Exercise Sleeping Smile Photo,Image,Pics-

చూడముచ్చటగా, అందంగా, గ్రెషియస్ గా కనబడాలని అందరికి ఉంటుంది. దీనికోసం ఏవేవో మందులు వాడనక్కరలేదు. టైమ్ కేటాయించి ఫేస్ ప్యాక్ రోజూ పెట్టుకోవాల్సిన పనే లేదు. అయిదు మార్గాలు, అయిదంటే అయిదే అలవాట్లు చాలు.

* నీళ్లు బాగా తాగడం, ఎల్లప్పుడ హైడ్రేటెడ్ గా ఉండటం. ఇది అన్నిటికన్నా ముఖ్యమైన పని. చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం వరకే కాదు, శరీరాన్ని లోపలి నుంచి అందంగా ఉంచుకుంటేనే బయటకి కూడా అందంగా కనబడతారు.

* సరైన నిద్ర కేటాయించడం. శరీరానికి సరైన విశ్రాంతిని ఇవ్వనంత కాలం అందంగా కనబడాలనుకోవడం అత్యాశే. రోజుకి 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా ఒంటికి ఇవ్వాల్సిందే. అప్పుడే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

* చెడు అలవాట్లకి దూరంగా ఉండటం. సిగరేట్లు, మద్యం మీ అందాన్ని, చర్మ సౌందర్యాన్ని చెడగొట్టేవే. ముఖ్యంగా సిగరేట్లకి దూరంగా ఉండటం. మహేష్ బాబు, హృతిక్ రోషన్ లాంటి అందగాళ్ళు సిగరేట్లు ఎందుకు మానేశారో అర్థం చేసుకోండి. అలాగే అరోగ్యకరమైన తిండి, ఫలాలు తినడం.

* శరీరాన్ని కదిలించడం. అంటే క్రమం తప్పని వ్యాయామం. శరీరాన్ని ఒకే చోట కూర్చోబెట్టకుండా, కాస్త పనిని ఇవ్వండి. రక్తం శరీరమంతా బాగా సరఫరా జరిగేలా చూసుకోండి.

* వేదాంతం లాగా అనిపించినా, నవ్వు అందాన్ని పెంచుతుంది. నవ్వులో ఉన్న అందం మరెక్కడ ఉండదు. మానసిక సమస్యలను దగ్గరకి రానివ్వకుండా నవ్వుతూ ఉండటానికి ప్రయత్నించండి. మీరెప్పుడు అందంగా కనబడతారు.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...కిడ్నీల్లో రాళ్ళు తీసేయడానికి ఒక జ్యూస్ ఉంది

About This Post..అందంగా కనబడటానికి అయిదు మార్గాలు

This Post provides detail information about అందంగా కనబడటానికి అయిదు మార్గాలు was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health Tips,Telugu News.

5 simple ways to look beautiful, Drink Water, Exercise, Sleeping, Smile, Beauty Tips, Beautiful without makeup

Tagged with:5 simple ways to look beautiful, Drink Water, Exercise, Sleeping, Smile, Beauty Tips, Beautiful without makeup5 simple ways to look beautiful,Beautiful without makeup,Beauty Tips,Drink Water,exercise,sleeping,smile,,Rojafake Com