మగవారి కన్నా ముందే మహిళా క్రికేట్ సాధించిన 5 ప్రపంచ రికార్డులు

క్రికేట్ .ప్రపంచంలో అత్యధిక జనాభా ఇష్టపడే ఆటల్లో రెండొవది.

 5 Records Women Cricket Achieved Much Before Than Men’s-TeluguStop.com

ఫుట్ బాల్ తరువాత అత్యంత పాపులర్ క్రీడ ఇదే.వందల ఏళ్ళ క్రితం మొదలైన దీని చరిత్ర చాలా గొప్పది.మిగితా ఆటల్లా తక్కువ సమయంలో పూర్తయ్యే ఆట కాకపోయినా మనం దీన్ని ఇష్టపడుతున్నాం, దీనికోసం సమయం కేటాయిస్తున్నాం, కాలేజీలు, ఆఫీసులు డుమ్మా కొడుతున్నాం.

సచిన్ బ్యాటింగ్ కోసం ప్రయాణాలు వాయిదా పడేవట, సచిన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మిగితా ఛానెళ్ళ టీఆర్పీలు దారుణంగా పడిపోయేవట.

ఇప్పుడు కొహ్లీ బ్యాటింగ్ చేస్తే ఇంచుమించు అలాంటి పరిస్థితే ఉంది.క్రికేట్ ని మనం ఇంతలా ఇష్టపడటానికి కారణం వీరు మాత్రమే కాదు.కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్, సౌరవ్ గంగూలి, పాంటింగ్, గిల్ క్రిస్ట్, అజరుద్దిన్, వసీమ్ అక్రమ్, మెక్ గ్రాత్, ద్రావిడ్, ధోని .ఇలా ఎందరో గొప్ప ఆటగాళ్ళు ఈ ఆటని జనరంజకం చేసారు.కాని క్రికేట్ అంటే కేవలం మగవారి ఆటేనా ?

వుమెన్ క్రికేట్ గురించి ఎందుకు పట్టించుకోరు? కొహ్లీ, రోహిత్ ఆటను గంటలకొద్దీ చూసే మహిళా ప్రేక్షకులు కూడా మహిళల క్రికేట్ ని చూడట్లేదు అనుకుంటా.ఈరోజు భారత మహిళల జట్టు పాకిస్తాన్ తో తలపడనుంది.

నడుస్తున్న మహిళా ప్రపంచకప్ లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని భారత్ మిథాలి రాజ్, స్మృతి మందానాల బలంతో సంచలన విజయాలు సాధిస్తోంది.ఈ సందర్భంలో మహిళల క్రికేట్ గురించి కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోండి.

ఇది చదివాక అయినా మీకు వుమెన్ క్రికేట్ మీద ఇంటరెస్టు పుట్టొచ్చు.

* మహిళల క్రికేట్ 1745వ సంవత్సరంలో మొదలైంది.

అయితే అంతర్జాతీయ స్థాయి ఆట మాత్రం 1934లో స్టార్ట్ అయ్యింది.ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా జట్లు వుమెన్ క్రికేట్ లో మొదటిసారి తలపడ్డాయి.

* మగవారి ఆటలో ప్రపంచకప్ మొదలవడానికి రెండు సంవత్సరాల ముందే మహిళల ప్రపంచకప్ మొదలైంది (1973).అంటే మగవారి కన్నా ముందు ప్రపంచకప్ ఆడింది ఆడవాళ్ళే అన్నమాట.

* మగవారి కన్నా 9 సంవత్సరాల ముందే మహిళలు వన్డే క్రికేట్ లో 400లకు పైగా పరుగులు సాధించారు.1997 లో పాకిస్తాన్‌ పై 455 పరుగులు చేసింది న్యూజిలాండ్‌ జట్టు.1997 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా డెన్మార్క్ పై 50 ఓవర్లలో 412/3 స్కోర్ చేసింది.

* వన్డేలో ఒక్క మ్యాచిలో 200 స్కోర్ సాధించిన మొదటి ప్లేయర్ అంటే సచిన్ టెండుల్కర్ అని ఠక్కున చెప్పేస్తాం.కాని అది తప్పు జవాబు.1997 సంవత్సరంలోనే ఓ మహిళ డబుల్ సెంచరి సాధించింది.అది కూడా సచిన్ సొంత ఊరు ముంబైలో.ఆస్ట్రేలియా బ్యాటర్ మెలిందా డెన్మార్క్ పై 145 బంతుల్లో 229 పరుగులతో నాటౌట్ గా నిలిచింది.

* అతితక్కువ వయస్సులో సెంచరి చేసిన ప్లేయర్ షాహిద్ ఆఫ్రిదీ కాదు.మన భారత జట్టు కెప్టెన్ మిథాలి రాజ్.

ఆఫ్రీది 16 ఏళ్ళు 217 రోజులకి తన మొదటి సెంచరీ సాధిస్తే, మిథాలి రాజ్ 16 ఏళ్ళు 205 రోజుల్లో, తన మొదటి మ్యాచ్ లోనే సెంచరీ సాధించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube