కన్నీళ్లు కారిస్తే ఆరోగ్యానికి ఇన్ని లాభాలున్నాయా !

మనకు కన్నీళ్లు ఎందుకు వస్తాయి? ఏదైనా తట్టుకోలేకని భావోద్వేగం కలిగినప్పుడు వస్తాయి.అంటే భరించలేని దుఃఖం ఉన్నప్పుడు లేదా పట్టరాని సంతోషం కలిగినప్పుడు.

 5 Reasons Why Shedding Tears Is Good For Your Health-TeluguStop.com

బాధలో కారిస్తే ఏడుపు అంటాం, సంతోషంలో వస్తే ఆనందభాష్పాలు అంటాం.ఈ కన్నీరు కార్చడం అంటే అపశకుమని, ఇంటికి మంచిది కాదని ఏవేవో అంటారు.

ఇక మగవారైతే ఎప్పుడు గాంభీర్యంగానే ఉండాలి తప్ప ఎడవకూడదని అని అంటారు.ఎడిచేవాడు మగాడే కాదని కూడా అంటారు.

మగవారి కన్నీళ్లను టెస్ట్టోస్టీరోన్ హార్మోన్ కంట్రోల్ చేసి బయటకి ఎక్కువగా రాకుండా చేయొచ్చు కాని, మగవాడు కూడా ఏడుస్తాడు.కన్నీళ్లు అపశకునం కాదు, కేవలం ఆడవారి ఆస్తి కాదు.

కన్నీళ్లు కూడా మంచివే.ఎలాగంటారా ?

టాక్సిన్స్ బయటకి :

మన శరీరంలోంచి మూడు రూపాల్లో టాక్సిన్స్ తీసుకొచ్చే ద్రవం బయటకి వస్తుంది.ఒకటి మూత్రం, రెండు చెమట, మూడు కన్నీరు.అంటే కన్నీటి ద్వారా కొన్ని మలీనాలు శరీరంలోంచి బయటకి వస్తాయి అన్నమాట.కన్నీరు శరీరంలోంచి కార్టిసాల్ లాంటి స్ట్రెస్ హార్మోన్ ని ఉత్పత్తి చేసే కెమికల్స్ ని బయటకి తీస్తుంది.కాబట్టి మీ ఏడుపు ఎప్పుడు ఊరికే పోదు, కొంతవరకు టాక్సిన్స్ ని బయటకి తీసుకొనే పోతుంది.

మంచి చూపు :

కంట్లో కూడా డీహైడ్రషన్ ఉంటుంది తెలుసా.ఔను .కళ్ళలో తేమ లేనప్పుడు మన చూపు మందగిస్తుంది.అప్పుడు లాక్రిమల్ గ్లాండ్ నుంచి వచ్చే కన్నీరు మన కనుగుడ్లని లుబ్రికేట్ చేస్తుంది.

లిడ్స్ ని కడిగి మన చూపుని మెరుగుపరుస్తుంది.కొంచెం ఎక్కువ ఎమోషనల్ అయ్యే జనాలకి కంటిచూపు బాగా ఉంటుందని అందుకే సైన్స్ చెబుతోంది.

ఓ అద్దాన్ని నీటితో శుభ్రపరిచాక ఎలాగైతే మనకు అన్ని క్లియర్ గా కనిపిస్తాయో, కనుగుడ్లు అంతే, కన్నీటితో కడిగాక చూపు మెరుగుపడుతుంది.

ఎమోషన్స్ ని తగ్గిస్తుంది :br/>br/>

మనిషి ఎందుకు ఏడుస్తాడు ? బాధను దించుకోవడానికే కదా.దీనిలో పెద్దగా సైన్స్ లేదు.కన్నీరు ఎమోషన్స్ యొక్క బరువుని దించుతుంది.

కొద్దిగా అయినా మూడ్ ని ఎలివేట్ చేస్తుంది.అందుకే బాధగా ఉన్నప్పుడు ఏడవాలి.

తప్పు కాదు, తప్పదు.అప్పుడే మీలో హార్మోనల్ మార్పులు జరిగి మనసు కాస్త కుదుటపడుతుంది.

br/>br/>

బ్యాక్టీరియా అంతం :br/>br/>

కన్నీటిలో లిసోజైమ్ అనే ఫ్లూయిడ్ ఉంటుంది.దీనికి బ్యాక్టీరియాని అంతం చేసే శక్తి ఉంటుంది.

రోజు మనం చేసే ప్రయాణాల వలన రోజు మన కంట్లో దుమ్ముధూళి పడుతోంది.అయినా బ్యాక్టీరియా మన కంటికి హాని చేయలేకపోవడానికి కన్నీటిలో ఉండే ఈ ఎలిమెంట్ కారణం.

మన కన్నీటిని ఇతర భాగాలపై ఉండే బ్యాక్టీరియా మీదా కూడా ప్రయోగించవచ్చు అని 2011 లో జరిగిన ఓ పరిశోధన చెప్పింది.br/>br/>

స్ట్రెస్ మాయం :br/>br/>

కార్టిసాల్ అనే హార్మోనే మనలో ఉండే ఒత్తిడి, స్ట్రెస్ కి కారణం.ఈ హార్మోన్ ని కొన్నిరకాల కెమికల్స్ ఉత్పత్తి చేస్తాయి.ఇంతకుముందు చెప్పినట్టుగా, కన్నీరు టాక్సిన్స్ ని బయటకి తీస్తూ, ఇలాంటి కెమికల్స్ ని బయటకి లాగుతుంది.దాంతో కార్టిసాల్ ఉత్పత్తి తగ్గి స్ట్రెస్ కూడా తగ్గుతుంది.ఏడిచిన తరువాత బాధ తగ్గడానికి కారణం ఇదే.అదంతే, మన శరీరంలో జరిగే ప్రతి మార్పుకి హార్మోన్లే కారణం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube