హస్తప్రయోగం గురించి తరుచుగా అడిగే 5 ప్రశ్నలు

హస్తప్రయోగం సాధారణంగా 15-16 సంవత్సరాల వయసులో మొదలయ్యే అలవాటు.ఆ దశలో యువతియువకులకి తమ శరీరంలో జరుగుతున్న మార్పుల గురించి ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు, ఇంకెన్నో భయాలు ఉంటాయి.

 5 Most Asked Questions About Masturbation-TeluguStop.com

హస్తప్రయోగం గురించి అయితే చెప్పనక్కర్లేదు, ఎన్నో అబద్ధాలు ప్రచారంలో ఉంటాయి.అందుకే యువత హస్తప్రయోగం గురించి తరుచుగా సేక్సాలాజిస్టును కొన్ని కామన్ ప్రశ్నలు అడుగుతుంటారు.అలా హస్తప్రయోగం గురించి ఎక్కువగా అడిగే ఆ 5 ప్రశ్నలు ఇవే.

* వీర్యం బయటకి రావడం అంటే రక్తం నష్టపోవడమా ?

జవాబు : కానే కాదు.రక్తం మోసుకొచ్చే ఆక్సిజన్ మరియు న్యూట్రిషన్ వీర్యాన్ని ఉత్పత్తి చేసేందుకు సహాయపడతాయి.శరీరంలో ఏ భాగమైన ఇంతే.అంతేతప్ప, వీర్యం బయటకి రావడం అంటే రక్తం బయటకి రావడం అనేది తప్పు.వీర్యంలో ప్రధానంగా ఫ్రుక్టోస్, సోడియం, పొటాషియం ఉంటాయి.సిట్రేట్, కాల్షియం, గ్లూకోజ్ ఇలా ఇంకొన్ని మినరల్స్ ఉంటాయి.

* హస్తప్రయోగం వలన మొటిమలు వస్తాయా ?

జవాబు : ఇది కూడా ఓ పెద్ద అపోహా.మొటిమలు రావడానికి హస్తప్రయోగానికి సంబంధం లేదు.మొటిమలు ఆయిల్ స్కిన్ వలన, సేబం ప్రొడక్షన్ వలన, జీన్స్ వలన, మనం తినే ఆహారం వలన వస్తాయి.అలాగే హార్మోన్స్ లో అవకతవకలు మొటిమలు తీసుకొస్తాయి.

* హస్తప్రయోగం శృంగారం మీద ఆసక్తిని తగ్గిస్తుందా?

జవాబు : హస్తప్రయోగం అనేది ఒక అడిక్షన్ కానంత వరకు దానివలన లాభాలే తప్ప నష్టాలు లేవు.ఈ అలవాటు శృంగారం మీద ఆసక్తి పెంచడమే ఎక్కువ జరుగుతుంది.కాని కొన్ని కేసుల్లో, హస్తప్రయోగం మీద ఇష్టం, శృంగారం మీద విముఖత చూపించే వారు కూడా ఉన్నారు.

* హస్తప్రయోగం శరీరాన్ని వీక్ గా మారుస్తుంది?

జవాబు : ఎవరైనా బక్కచిక్కిపోతే హస్తప్రయోగం ఎక్కువ చేసుకుంటున్నాడెమో అని అనేస్తారు.ఇందులో కూడా నిజం లేదు.

శృంగారం మనిషిని బలహీనంగా మార్చలేనప్పుడు, అంతకంటే తక్కువ కాలరీలు ఖర్చు చేయించే హస్తప్రయోగం ఎలా బలహీనుల్ని చేస్తుంది.హస్తప్రయోగం చిన్నిపాటి అలసట తీసుకురావడం వలన అలా భ్రమపడతారేమో.

* హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతాయా ?

హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్నా, లేకున్నా, వీర్యకణాలు చనిపోయి కొత్త వీర్యకణాలు పుడుతూనే ఉంటాయి.ఇది నిత్యం జరిగే ప్రాసెస్.

కాబట్టి హస్తప్రయోగం వలన వీర్యకణాలు తగ్గిపోతుంది అనుకోవడం పొరపాటే.నిజానికి హస్తప్రయోగం వలన టెస్ట్టోస్తీరోన్ హార్మోన్ బాగా ఉండి వీర్యకణాలు పడిపోకుండా ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube