ఆడవారి శరీరానికి ఈ ఐదు చాలా అవసరం

ఓ సినికవి అన్నట్లు, ఆడజన్మ చాలా కష్టమైనది.ఓ వయసుకి వచ్చారంటే, శారీరకంగా, మానసికంగా ఎన్నోరకాల ఒత్తిళ్ళకు గురవుతారు.

 5 Basic Nutrients Required For A Woman Body-TeluguStop.com

శారీరకంగా ఎన్నేసి మార్పులు జరుగుతాయో.ఋతుక్రమం మొదలైతే చాలు నొప్పులను, రక్తాన్ని చూస్తూనే ఉండాలి కొన్ని దశాబ్దాలపాటు.

అందుకే ఆడవారి శరీరం ఎప్పుడు సమస్యలతో పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి.దానికి ఓ అయిదు అవసరాలున్నాయి.

* మగవారికి ఏదైనా గాయం తగిలితేనే రక్తం బయటకు వచ్చేది.కాని ఆడవారికి అలా కాదుగా.

నెలసరిలో రక్తం బయటకి వస్తుంది.ఇలా రెగ్యులర్‌గా జరుగుతుంది కాబట్టి, ఒంటిలో ఐరన్ శాతం తగ్గే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది.

అందుకోసమే ఐరన్ లభించే ఆహారం, పండ్లు ఖచ్చితంగా తింటూ ఉండాలి మగవలు.బీన్స్, నట్స్, క్యారట్, సీ ఫూడ్, లీన్ మీట్ .ఇలాంటి వాటిమీద ధ్యాస పెట్టాలి.

* మగవారు ఎక్కువగా బయటి పని మీదే దృష్టిపెట్టి, పని పూర్తవగానే ఇంటికొచ్చి విశ్రాంతి తీసుకుంటారు.

కాని ఆడవారు అలా కాదు, నిద్రలేచిన దగ్గరినుంచి, మళ్ళీ రాత్రిపూట కునుకు తీసేదాకా, తీరకనేది లేకుండా శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురవుతారు.దీనికితోడు ఉద్యోగం కూడా చేస్తే ఒత్తిడి మరింత పెరుగుతుంది.

కాబట్టి ఒంటికి మెగ్నీషియం చాలా అవసరం.దీనికోసం ఎక్కువగా ఆకుకూరలు, నట్స్ తినాలి.

* బ్లడ్ ప్రెషర్ సమస్యలు కూడా స్త్రీలలో బాగా కనిపిస్తాయి.కాబట్టి ఒమేగా 3 ఫాట్టి ఆసిడ్స్ శరీరంలో పడటం ఎంతో అవసరం.

చేపల్లో, వాల్నట్స్ లో ఇది లభిస్తుంది.

* ఇంటి పనులు చేయడం అనుకున్నంతా ఈజీ కాదు.

ఒక్కరోజు బట్టలు పిండినా, పాత్రలు కడిగినా తెలిసిపోతుంది.అలాంటిది కొన్ని సంవత్సరాల పాటు అలాంటి పనులు చేయాల్సివస్తుంది కాబట్టి, ఎముకల్లో బలం తగ్గిపోతూ ఉంటుంది.

ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం అవసరం.పాలు, ఆల్మండ్స్, చీజ్ లో ఇది బాగా లభిస్తుంది.

* శరీరానికి కేవలం కాల్షియం మాత్రమే లభిస్తే సరిపోదు.కాల్షియంని శరీరం బాగా గ్రహించాలి అంటే విటమిన్ డి కూడా కావాలి.

సూర్యరశ్మి , ఫాట్టి ఫిష్, సాల్మన్ ఫీష్ లో విటమిన్ డి బాగా దొరుకుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube