పాదాల దురదను తగ్గించటానికి అద్భుతమైన ఇంటి నివారణలు

పాదాల దురదకు అనేక కారకాలు మరియు అనేక పరిస్థితులు ఉంటాయి.పాదాల దురదకు పాదాలు ఎక్కువగా తేమగా లేదా పొడిగా ఉండటం కూడా కారణం కావచ్చు.

 5 Amazing Home Remedies For Itchy Feet-TeluguStop.com

అయితే పాదాల చర్మం ఎరుపు,బాధాకరమైన బొబ్బలు, పగుళ్ళు ఉంటే భాధ తీవ్రత ఎక్కువగా ఉందని అర్ధం.పాదాల దురదను తగ్గించటానికి సహజమైన ఇంటి నివారణలు ఉన్నాయి.

ఇవి బాధను తగ్గించటమే కాకుండా చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.ఇప్పుడు ఆ ఇంటి నివారణల గురించి తెలుసుకుందాం.

1.బేకింగ్ సోడా

బేకింగ్ సోడా పాదాల దురద చికిత్సలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

ఇది మంట నుండి ఉపశమనం కలిగించటమే కాకుండా అసౌకర్యాన్ని కూడా తగ్గిస్తుంది.రెండు స్పూన్ల బేకింగ్ సోడాలో నీటిని పోసి పేస్ట్ గా తయారుచేయాలి.

ఈ పేస్ట్ ని పాదాల ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యిన తర్వాత శుభ్రం చేసి పొడి గుడ్డతో తుడవాలి.ఒకవేళ చికాకు తగ్గకపోతే డాక్టర్ ని సంప్రదించాలి.

2.పెట్రోలియం జెల్లీ

పెట్రోలియం జెల్లీ పొడి చర్మం కారణంగా వచ్చే పాదాల దురద చికిత్సలో అద్భుతంగా పనిచేస్తుంది.

పెట్రోలియం జెల్లీని పాదం మీద రుద్దటం వలన తేమ లాక్ అయ్యి త్వరగా నయం అవుతుంది.రాత్రి సమయంలో పాదాలకు పెట్రోలియం జెల్లీ రాసి సాక్స్ వేసుకోవాలి.ఈ విధంగా కొన్ని రోజుల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది.

3.ఉప్పు నీరు

గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పాదాలను కొంతసేపు ఆ నీటిలో పెట్టాలి.ఉప్పు నీరు బాధాకరమైన పాదాల దురదను తగ్గించటంలో సహాయపడుతుంది.దురద తగ్గేవరకు ఈ విధంగా చేస్తూ ఉండాలి.

4.పిప్పరమింట్ ఆయిల్

పిప్పరమింట్ ఆయిల్ అనేది పాదాల దురదను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది.పిప్పరమింట్ ఆయిల్ లో ఉండే చల్లబరిచే లక్షణాలు చర్మాన్ని ప్రశాంతపరచి వాపు మరియు నొప్పిని తగ్గిస్తుంది.

ఇది పొడి చర్మం కారణంగా వచ్చే పాదాల దురదను తగ్గించటంలో సహాయపడుతుంది.కొన్ని చుక్కల పిప్పరమింట్ ఆయిల్ ని పాదాలకు రాసుకోవాలి.ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల పిప్పరమింట్ ఆయిల్ ని వేసి ఆ నీటిలో పాదాలను కొంతసేపు ఉంచాలి.

5.తెల్ల వెనిగర్

తెల్ల వెనిగర్ పాదాల దురదను తగ్గించటంలో సహాయపడుతుంది.ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకోని దానిలో రెండు స్పూన్ల తెల్ల వెనిగర్ వేసి దానిలో కొన్ని నిమిషాల పాటు పాదాలను ఉంచాలి.

వెనిగర్ లో ఉండే ఆమ్ల గుణం శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియాను చంపుతుంది.ఆ తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ రాయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube