365 డేస్‌ వర్సెస్‌ మోసగాడు

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నెలకో సినిమా చొప్పున విడుదల చేస్తున్నాడు.కాని గత కొన్ని నెలలుగా వర్మ రూపొందిచిన ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్స్‌ వర్షం కురిపించింది లేదు.

 365 Days Movie Vs Mosagallaku Mosagadu-TeluguStop.com

కనీసం ప్రేక్షకులతో పర్వాలేదు అని కూడా అనిపించుకోలేదు.ఆ కసితో వర్మ తెరకెక్కించిన సినిమా ‘365 డేస్‌’.

నందు, అనైన జంటగా నటించిన ఈ సినిమా ప్రతి ఇంట్లో జరిగే సంఘటల ఆధారంగా తెరకెక్కించడం జరిగింది.చాలా కాలం తర్వాత వర్మ తెరకెక్కించిన సినిమాకు క్లీన్‌ యూ సర్టిఫికెట్‌ వచ్చింది.దాంతో వర్మ తెగ ప్రచారం చేస్తున్నారు.

‘365 డేస్‌’ రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమాకు పోటీగా సుధీర్‌బాబు హీరోగా నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ కూడా విడుదల కాబోతుంది.టైటిల్‌ ప్రధాన ఆకర్షణతో వస్తోన్న ఈ సినిమాపై సుధీర్‌బాబు చాలా ఆశలే పెట్టుకున్నాడు.

మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందో లేదో చూడాలి.ఈ రెండు సినిమాల్లో రేపు ప్రేక్షకులకు ఏ సినిమా నచ్చుతుంది అనేది మరి కొన్ని గంటల్లో తేలిపోనుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube