పాతికమంది కాంగ్రెసు ఎంపీల సస్పెన్షన్‌

లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ విసిగిపోయారు.ఇరవై ఐదు మంది కాంగ్రెసు ఎంపీలను ఐదు రోజులపాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

 25 Congress Lawmakers Suspended From Lok Sabha-TeluguStop.com

గత నెల ఇరవై ఒకటో తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు సభను సాగనివ్వకుండా కాంగ్ర ఎసు పార్టీ అడ్డుకుంటోంది.ప్రతి రోజు గందరగోళం సృష్టిస్తోంది.

నానా రభస చేస్తోంది.లలిత్‌ మోదీ కుంభకోణంతో సంబంధం ఉన్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజే, వ్యాపం కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్‌ ముక్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో కాంగ్రెసు సభను స్తంభింప చేస్తోంది.

వీరు ముగ్గురూ రాజీనామా చేసేంతవరకూ సభను జరగనివ్వబోమని కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రతిజ్ఞ చేశారు.పక్కా వ్యూహంతో కాంగ్రెసు సభలో గందరగోళం సృష్టిస్తోంది.

పార్లమెంటు సమావేశాలు మరో పది రోజుల్లో ముగుస్తున్నాయి.కాని ఇప్పటి వరకు ఒక్క ప్రజా సమస్యపైన కూడా చర్చించలేదు.

ప్రజలు ఎన్నుకుంటే పార్లమెంటుకు వెళ్లిన నాయకులు ప్రజా సమస్యలపై చర్చలు జరపకపోవడం క్షమించరాని నేరం.సస్పెండైన ఎంపీలు ఐదు రోజుల తరువాత పార్లమెంటుకు వస్తారు.

మళ్లీ గందరగోళం మామూలే.వానకాల పార్లమెంటు సమావేశాలు వాషవుట్‌ అయిపోయాయి.

ఇదీ మన ప్రజాస్వామ్యం….!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube