2019లో లోకేశ్ - బ్రాహ్మ‌ణికి టిక్కెట్లు క‌న్‌ఫార్మ్ చేసిన బాబు

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో సీఎం చంద్ర‌బాబు ఫ్యామిలీ నారా ఫ్యామిలీతో పాటు పార్టీ వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ సీఎం ఎన్టీఆర్ ఫ్యామిలీ నంద‌మూరి ఫ్యామిలీ మెంబ‌ర్స్ ప్రాధాన్యం మ‌రింత పెర‌గ‌నుంది.ఇప్ప‌టికే ఈ రెండు ఫ్యామిలీల నుంచి సీఎంగా చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ మంత్రిగా ఉన్నారు.

 2019 Elections: Tickets Confirm For Lokesh And Brahmani-TeluguStop.com

ఇక బాబు వియ్యంకుడు నంద‌మూరి బాల‌కృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు, కోడ‌లిని చంద్ర‌బాబు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దించ‌డం క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టే.

ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ, మంత్రిగా ఉన్న లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో డైరెక్టుగా ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్నారు.లోకేశ్ కోసం ముందుగా కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు పేరు ప‌రిశీలించినా ఫైన‌ల్‌గా త‌మ‌కు బాగా క‌లిసొచ్చిన హిందూపురం పేరును ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక్క‌డ ప్ర‌స్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బాల‌య్య వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత రాజ్య‌స‌భ‌కు వెళ్లేలా బాబు ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

ఇక లోకేశ్‌కు హిందూపురం ఫిక్స్ చేస్తే, బాల‌య్య రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డం ఖ‌రార‌వుతుంది.

ఇక చంద్ర‌బాబుకు ఎలాగూ కుప్పం ఉండ‌నే ఉంది.ఇక కోడ‌లు నారా బ్రాహ్మ‌ణిని చంద్ర‌బాబు విజ‌య‌వాడ ఎంపీ సీటు నుంచి బ‌రిలో దింపేందుకు అప్పుడే ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశార‌ట‌.

ప్ర‌స్తుతం అక్క‌డ ఎంపీగా ఉన్న కేశినేని నానిని ప‌క్క‌న పెట్ట‌డ‌మో లేదా ఆయ‌నకు మరేదైనా ప‌దవి ఇచ్చి అక్క‌డ నుంచి బ్రాహ్మ‌ణిని బ‌రిలో దించ‌నున్నారు.

ఏదేమైనా 2019 ఎన్నిక‌ల్లో బాబు కొడుకు, కోడ‌లు ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖ‌రారు కాగా, వీరంద‌రూ గెలిస్తే ఈ రెండు ఫ్యామిలీల నుంచి ఏకంగా ఐదుగురు చ‌ట్ట‌స‌భ‌ల్లో ఉన్న‌ట్ల‌వుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube