నంద‌మూరి- నారా ఫ్యామిలీల‌కు టిక్కెట్లు క‌న్‌ఫార్మ్‌

ఏపీలో అధికార టీడీపీకి కేంద్ర ఫ్యామిలీలు అయిన నంద‌మూరి, నారా ఫ్యామిలీల‌కు చెందిన చాల మంది ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు.ప్ర‌స్తుతం ఈ రెండు ఫ్యామిలీల నుంచే ముగ్గురు ఏపీ చ‌ట్ట‌స‌భ‌ల‌కు ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు.

 2019 Elections : Nara-nandamuri Families Tickets Confirmed-TeluguStop.com

సీఎం చంద్ర‌బాబు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా ఉంటే, ఆయ‌న వియ్యంకుడు బాల‌య్య హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.ఇక మంత్రిగా ఉన్న బాబు త‌న‌యుడు నారా లోకేశ్ మండ‌లికి ప్రాథినిత్యం వ‌హించ‌డంతో పాటు కేబినెట్‌లోను ఉన్నారు.

ఇదిలా ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా ఫ్యామిలీ నుంచి బాబు, లోకేశ్‌తో పాటు లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి సైతం తొలిసారిగా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోది దిగ‌నున్నారు.ఈ ఫ్యామిలీ నుంచి ముగ్గురు ఎన్నిక‌ల బ‌రిలో ఉంటే అటు నంద‌మూరి ఫ్యామిలీ నుంచి బాల‌య్య సైతం రంగంలో ఉండ‌నున్నారు.

మొత్తంగా ఈ రెండు ఫ్యామిలీల నుంచే న‌లుగురు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఖ‌రారైంది.

ఈ నేప‌థ్యంలో వీరు న‌లుగురు పోటీ చేసే స్థానాల‌పై కూడా క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

కుప్పం నుంచి చంద్ర‌బాబు వ‌రుస‌గా ఆరుసార్లు గెలిచి డ‌బుల్ హ్యాట్రిక్ కొట్టారు.వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న మ‌రోసారి అక్క‌డి నుంచే పోటీ చేయ‌నున్నారు.

ఇక బాబు త‌న‌యుడు లోకేశ్ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు.దొడ్డిదారిన వచ్చారని ప్రత్యర్థులు తీవ్రస్థాయిలో ఆయ‌న‌పై విమర్శలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో లోకేశ్ రాజ‌ధాని కేంద్రంగా ఉన్న‌ కృష్ణాజిల్లాలోని పెనమలూరు నియోజకవర్గాన్ని ఎంచుకోనున్నట్లు సమాచారం.ఈ క్ర‌మంలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్‌ పెనమలూరు పై ఇటీవల కాలంలో ప్రత్యేక దృష్టి పెట్టారు.

ఇక లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి గుంటూరు లోక్‌స‌భ నుంచి బ‌రిలో దిగ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టే.

ఇక బాల‌య్య సైతం నియోజ‌క‌వ‌ర్గం మారి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి పోటీ చేస్తార‌ని నిన్న‌టి వ‌ర‌కు వార్తలు వ‌చ్చాయి.

అయితే ఆదివారం హిందూపురం ప‌ర్య‌ట‌న‌లో బాల‌య్య తాను హిందూపురం నుంచి మారే ప్ర‌శ‌క్తే లేద‌ని చెప్పేశారు.దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో నారా, నంద‌మూరి ఫ్యామిలీ మెంబ‌ర్స్ పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గాల‌పై క్లారిటీ వ‌చ్చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube