"ఐటీ" బ్రాండ్ గా మారనున్న హైదరాబాద్!!

రాష్టం విడిపోయిన తరువాత అందరూ హైదరాబాద్ భవిష్యత్తుపై అనేకానేక పుకార్లను రేకెత్తించి హైదరాబాద్ ఐటీ ఉద్యోగస్తులకు భయానక వాతావరణాన్ని కలిగించేలా మాట్లాడడంతో చాలా మంది ఉద్యోగస్తులు ఏమయిపోతుందో భవిష్యత్తు అని భయాందోళనలకు గురయ్యారు.అయితే ఇప్పుడు వచ్చిన వార్త వింటే ఐటీ రంగానికి హైదరాబాద్ ఒక బ్రాండ్ గా మారనుంది అని ఎవ్వరైనా ఒప్పుకుని తీరాల్సిందే.

 2018 It Congress Will Be In Hyderabad-TeluguStop.com

విషయం ఏమిటంటే తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఒక అంతర్జాతీయ సదస్సుకు వేదికగా మారనుంది.ప్రపంచ ఐటీ కొంగ్రెస్ 2018లో హైదరాబాద్ లో జరగనుంది.

ఇప్పటి వరకూ యూరోప్ లోనే జరిగిన ఈ సదస్సు ఒక్కటంటే ఒక్కసారి ఆసియా ప్రాంతంలో సింగపూర్ లో నిర్వహించ బడింది.ఈసారి సైతం దాదాపు బెంగళూరు, డిల్లీ ఈ రెండు నగరాలు ఈ అవకాశం కోసం హోరా హోరీగా తలపడినప్పటికీ అదృష్టం మాత్రం హైదరాబాద్ కు దక్కింది.

ఈ సదస్సులో 80నుంచి 90దేశాలకు చెందిన కార్పరేట్ అధినేతలు, ఐటీ దిగ్గజాలు, విధ్యావేత్తలు, నిపుణులు, అధికార్లు పాల్గొని ఐటీ సంబందిత అంశాలపై చర్చించి, అభివృద్ది, విస్తరణ, అవకాశాలు, సవాళ్ళు, పరిష్కార పద్దతులు ఇలా అన్నింటిపైన ఆలోచనలు చేస్తారు.ఇక ఈ అవకాశం మన కేసీఆర్ ప్రభుత్వానికి పెను సవాల్ అనే చెప్పాలి.దీన్ని సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఈ దెబ్బతో హైదరాబాద్ ఐటీ నేం.1 గా మారడం ఖాయం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube