2015 నందమూరి నామ సంవత్సరం

నందమూరి ఫ్యాన్స్‌కు ఈ సంవత్సరం వరుసగా సంబరాలు చేసుకునే సినిమాలు వస్తాయంటూ నందమూరి కళ్యాణ్‌ రామ్‌ ‘టెంపర్‌’ ఆడియో వేడుకలో చెప్పుకొచ్చాడు.తన సినిమా ‘పటాస్‌’తో 2015లో నందమూరి వారి ప్రస్థానం మొదలు అయ్యింది.

 2015 Will Be As Nandamuri’s Year Says Kalyan Ram-TeluguStop.com

ఆ తర్వాత తమ్ముడు ‘టెంపర్‌’ రాబోతుంది.ఆ వెంటనే బాబాయి ‘లయన్‌’ చిత్రం కూడా నందమూరి అభిమానులను సంతృప్తి పర్చేందుకు రాబోతుంది.

ఈ మూడు సినిమాలు కూడా మూడు అక్షరాల పేర్లు కావడం ఒక సెంటిమెంట్‌ అంటూ కళ్యాణ్‌ రామ్‌ చెప్పుకొచ్చాడు.ఈ సంవత్సరం నందమూరినామ సంవత్సరం అని ఈ నందమూరి హీరో అన్నాడు.

ఆ తర్వాత ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.అన్న కళ్యాణ్‌ రామ్‌ అన్న మాటలకు మరింత బలం చేకూర్చుతు తప్పకుండా ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అయ్యి తీరుతుందని చెప్పుకొచ్చాడు.

బాబాయి ‘లయన్‌’ సినిమతో తప్పకుండా సత్తా చాటుతాడంటూ ఎన్టీఆర్‌ ధీమా వ్యక్తం చేశాడు.ఇక తన ‘టెంపర్‌’ సినిమా గత మూడు సినిమాల నిరుత్సాహాన్ని పోగొడుతుందని అభిమానులకు హామీ ఇచ్చాడు.

మరి ఈ నందమూరి హీరోలు న్నట్లుగా ఇప్పటికే సక్సెస్‌ అయిన ‘పటాస్‌’ చిత్రంలాగే ‘టెంపర్‌’, ‘లయన్‌’ చిత్రాలు కూడా సక్సెస్‌ అయ్యి, 2015 సంవత్సరం నందమూరి నామ సంవత్సరం అవుతుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube