2015 సమీక్ష : నేషనల్ స్టార్ ప్రభాస్

జులై 10,2015 ఈ తేదికి ఒక్క రోజు ముందు కుడా ప్రభాస్ అంటే తెలుగులో మాస్ హీరో.అతనికి రికార్డులు లేకపోయినా చెప్పుకోదగ్గ మార్కెట్ ఉంది.

 2015 Review : Prabhas, The National Star-TeluguStop.com

తెలుగు యువతలో మంచి క్రేజ్ ఉంది.బాహుబలి విడుదల అవగానే దేశవ్యాప్తంగా ప్రభాస్ పేరు మారుమ్రోగింది.

ముందే తెలిసిన నార్త్ జనాలు ఒకే కాని, తెలియని వారంతా గూగుల్ వాడారు.ప్రభాస్ గురించి తెలుసుకున్నారు.

ఇప్పుడు ప్రభాస్ అంటే దేశవ్యాప్తంగా తెలుసు.రాత్రికి రాత్రే దశ తిరిగిపోవడం అంటే ఇదేనేమో !

బాహుబలికి ముందు ప్రభాస్ కి అతిపెద్ద హిట్ 47 కోట్లు కలెక్ట్ చేసిన మిర్చి.

ప్రభాస్ కి అదే తోలి నలభై కోట్ల సినిమా.కాని ఇప్పుడు ప్రభాస్ అతిపెద్ద హిట్ బాహుబలి.

అది ప్రపంచవ్యాప్తంగా 580 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది, దాదాపు 300 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.ఒక తెలుగు సినిమా ఇంత ప్రభంజనం సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు.

మహేష్, పవన్ , ఇద్దరు కలిసి మల్టిస్టారర్ చేసినా ఈ కలెక్షన్లు రావు.ఈ కలెక్షన్లలో ప్రభాస్ పాత్ర ఎంతుంది అనేదాన్ని పక్కన పెడితే, రికార్డులు ప్రభాస్ పేరు మీదే ఉంటాయి.

ఈ ప్రభంజనంలో పెద్ద పాత్ర రాజమౌళిదే అయినా , ప్రభాస్ రాజమౌళి కలకు నిజరుపాన్ని ఇచ్చాడు.

మహీంద్రా కంపెని ప్రభాస్ ని జాతీయ ప్రచారకర్తగా ఎంచుకుంది.ప్రభాస్ కెరీర్ ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క.2016 లో వచ్చే బాహుబలి 2 అన్ని రికార్డులు తిరగరాయాలని, మన డార్లింగ్ దేశవ్యాప్తంగా అభిమానించబడాలని ఆశిద్దాం !

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube