2015 సమీక్ష : మహేష్ బాబు హీరో అఫ్ ది ఇయర్

వరుసగా రెండు డిజాస్టర్లు.ఒకటి కనీసం నటుడిగా ప్రశంసలు అయినా తీసుకొచ్చింది.

 2015 Review : Mahesh Babu Is Hero Of The Year-TeluguStop.com

మరొకటి ఈ సినిమా ఎందుకు చేసానబ్బా అని మహేష్ బాబు జీవితకాలం గుర్తుపెట్టుకునేలా చేసింది.మరోవైపు పవన్ ఇండస్ట్రీ హిట్ కొట్టి జోరు మీద ఉన్నాడు.

బన్ని కూడా దూకుడు ని టచ్ చేసి సవాలు విసురుతున్నాడు.ప్రభాస్ చేతిలో పెద్ద ప్రాజెక్ట్ ఉంది.

గోవిందుడు అందరివాడేలే ఆగడు కన్నా ఎక్కువ కలెక్ట్ చేసింది.మహేష్ పై విమర్శలు, మహేష్ సత్తాపై సందేహాలు, మొత్తంగా తీవ్ర ఒత్తిడి.

మహేష్ బయటి ప్రపంచానికి దూరంగా ఉన్నాడు.సుధీర్ బాబు రెండు సినిమాలు విడుదల చేస్తే, ఒక్కదాన్ని కుడా ప్రమోట్ చేయలేదు.

కొరటాల శివ అప్పటికి పెద్ద డైరెక్టర్ కాదు.అభిమానుల్లో ఆందోళన.

ఆగస్టు 7, 2015.వాతావరం వేడెక్కింది.

బెనిఫిట్ షోస్ నుంచే టాక్ ఊపందుకుంది.మహేష్ అభిమానుల ఆకలి తీర్చేసాడు.

ఫలితం శ్రీమంతుడు భారి బ్లాక్బస్టర్.

రికార్డులే రికార్డులు.

రాజమౌళి మగధీర, పవన్ అత్తారింటికి దారేది, ఒక్క బాహుబలి తప్ప అన్ని తెలుగు సినిమాల్ని సునాయాసంగా దాటేసింది శ్రీమంతుడు.వంద కోట్లు కొట్టడానికి నాకు తెలుగు భాష ఒక్కటి చాలు, గ్రాఫిక్స్, భారి బడ్జెట్ అస్సలు అక్కరలేదు అని నిరూపించాడు సూపర్ స్టార్.

తన సొంత స్టామినా మీద బయ్యర్లందరికి భారి లాభాలు తెచ్చిపెట్టాడు.కమర్షియల్ హీరోగా కన్నా, ఒక నటుడిగా శ్రీమంతుడిలో కనిపించి విమర్శకుల మనసులు గెలుచుకున్నాడు.

అందుకే మహేష్ బాబు హీరో ఆఫ్ ది ఇయర్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube