27 న షీ-టీమ్ ఆధ్వర్యంలో జెండర్ ఈక్వాలిటీ రన్

మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా షీ-టీమ్ లు పని చేస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అన్నారు.మహిళల భద్రత మరియు లింగ సమానత్వం గురించి అవగాహన కల్పించేందుకు ఖమ్మంలో మార్చి 27వ తేదీన ఉద‌యం 6:00 గంట‌ల‌కు ఖమ్మం పటేల్ స్టేడియం నుండి లకారం పార్క్‌ వరకు RUN కొనసాగుతుందని,దానికి సంబంధించి షీ-టీమ్స్ రన్ ప్రచార రధాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ గారితో కలసి మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభించారు.Vdo’s కాలనీలోని మంత్రి గారి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’ అనే థీమ్‌కు అనుగుణంగా, ఖమ్మం పోలీస్ శాఖ షీ-టీమ్‌ ఆధ్వర్యంలో జెండ‌ర్ ఈక్వాలిటీ 2కే, 5కే ర‌న్‌ను నిర్వ‌హించ‌నున్నారని తెలిపారు.మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మ‌హిళ‌ల‌కు నిరంత‌రం ర‌క్ష‌ణ క‌ల్పిస్తుందని అన్నారు.

 Gender Equality Run Under She-team On The 27th-TeluguStop.com

అనంతరం మహిళల భద్రత మరియు లింగ సమానత్వం గూర్చిన అవగాహన ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు.కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజా గారు, జెడ్పీ చైర్మన్ లింగల కమల్ రాజు గారు, సుడా చైర్మెన్ విజయ్ కుమార్ గారు, ఏసీపీ అంజనేయులు గారు, సిఐ లు అంజలి గారు, శ్రీధర్ గారు, సర్వయ్య గారు, చిట్టిబాబు గారు, విజయ్ గారు zptc ప్రియాంక గారు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube