ఎన్టీఆర్ కి దక్కనిది, నితిన్ కు దక్కుతుందా ?  

Will Nithiin Achieve What Ntr Didn’t ?-

యంగ్ టైగర్ ఎన్టీఆర్ … మహా నటుడు ఎన్టీఆర్ సిని వారసుడు.తాతకు తగ్గ మనవడు .టీనేజ్ లోనే రికార్డ్స్ ని జేబులో వేసుకొని తిరిగినవాడు .అయితే ఇదంతా గతం .

అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు .అందం, అభినయం, వాక్చాతుర్యం , అభిమానం .అన్ని ఉన్నా ఒకటి మాత్రం లేదు ఎన్టీఆర్ కి .ఏంటది ?

Will Nithiin Achieve What Ntr Didn’t ?- --

50 కోట్ల సినిమా … అవును .

ఎన్టీఆర్ కి ఇంతవరకు 50 కోట్ల సినిమా లేదు .తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్ళు సాధించిన బాద్షా కూడా 50 కోట్ల మార్కును అందుకోలేకపోయింది.

కాస్ట్ ఫేల్యూర్ గా నిలిచిన బాద్షా 47 కోట్ల షేర్ వద్దే ఆగిపోయింది.మరోవైపు మహేష్ 80 కోట్ల షేర్ మార్కును చేరుకుంటే .

పవన్ 70 కోట్ల షేర్ వసూళ్ళు రాబట్టాడు.ఈ రకంగా చాలా వెనుకబడిపోయాడు ఎన్టీఆర్ .

ఇక నితిన్ .తన కెరీర్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన సినిమా గుండె జారి గల్లంతయ్యిందే .

ఈ సినిమా వసూళ్ళు దాదాపు 23 కోట్ల షేర్ .లెక్కల ప్రాకారంగా నితిన్ మార్కెట్ ఎన్టీఆర్ లో సగమే అయినా .

నితిన్ ఇప్పుడు త్రివిక్రమ్ చేతిలో ఉన్నాడు .అ .ఆ చిత్రానికి గనుక హిట్ వస్తే 50 కోట్లు కొట్టడం అసాధ్యమేమీ కాదు .త్రివిక్రమ్ బ్రాండ్ అలాంటిది .

ఎన్టీఆర్ కి సాధ్యపడనిది .నితిన్ వల్ల అవుతుందా ? ఒకవేళ నితిన్ 50 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయిపోతే ఎన్టీఆర్ అభిమానుల పరిస్థితి ఏంటి ?

.

తాజా వార్తలు