పవన్ కళ్యాణ్ పేరుతొ వందల కోట్ల మోసం

పేరు పసుపులేటి రమేష్ బాబు.హైదరాబాద్ లో తాను ఒక జనసేన కార్యకర్త అని తెలుసు.

 200 Cr Fraud In The Name Of Pawan Kalyan And Janasena-TeluguStop.com

పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలుసు.కావాలంటే పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటోలు కూడా చూపిస్తాడు.

తనకి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చాలా క్లోజ్ అంటాడు.అడిగితే ఆయనతో దిగిన ఫోటోలు కూడా చూపిస్తాడు.

ఈ లిస్టు ఇక్కడితో ఆగిపోదు .ఈ రమేష్ కి వైకాపా అధినేత జగన్ పరిచయం అంట, చివరకి దేశ ప్రధాని నరేంద్రమోడి కూడా పరిచయమే అంట.బండారు దత్తాత్రేయ, లోక్ సత్తా పార్టి అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ .ఇలా ఇంతమందితో తాను దిగిన ఫోటోలు చూపిస్తాడు.

వీరితో పరిచయం అనే పేరుతో తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టమంటాడు.పెట్టకపోతే బెదిరిస్తాడు.ఫేస్ బుక్ లో పబ్లిక్ గా చంపేస్తానని బెదిరిస్తాడు.నాలుగేళ్ళుగా వందల కోట్లతో ఆటలాడుతున్నాడు.200 కోట్లకి పైగా మోసలతోనే పోగేసాడు.కిరణ్ కుమార్ రెడ్డితో పరిచయం అని నమ్మించి, ఓ రాజకీయ నేత దగ్గరినుంచే 70 లక్షలు కొట్టేసాడు.

ధర్మవరంలోని ఓ థియేటర్ యజమానిని తగులుకొని, మొబైల్ ఏజెన్సీలు ఇప్పిస్తానని, కేంద్రమంత్రులతో మాట్లాడుతానని లక్షలకి లక్షలు తీసుకున్నాడు.మంత్రులతో మాట్లాడేది లేదు, కాంట్రాక్ట్ ఇప్పించేది లేదు.నా డబ్బు ఎక్కడా అని థియేటర్ యజమాని అడిగితే, తన కారు డబ్బు చెల్లించే దాకా ఉంచుకొమ్మని కారు ఇచ్చి, ఆ తరువాత తన కారు పోయిందని ఆ థియేటర్ యజమాని మీదే రివర్స్ కేసు వేసిన ఘనుడు ఈ రమేష్ బాబు.

జనసేన పేరుతో ఓ కులవర్గం నేతకు దగ్గరయ్యాడు.

ఫండ్స్ పేరుతో డబ్బులు అడిగాడు.ఆ నేత నిరకారిస్తే తనని చంపినవారికి కోటి ఇస్తానని ఫేస్ బుక్ లో పబ్లిక్ గా పోస్టు పెట్టాడు.

ఆ నేత భార్య, కూతురిపై నీచమైన పోస్టులు పెట్టాడు.ఇక ఓ రియల్ ఎస్టేట్ మహిళా వ్యాపారిని కలిసి తన పెట్టబోయే ఛానెల్ లో డబ్బులు పెట్టమని అడిగాడు.

ఆమెని నమ్మించేందుకు ప్రధానితో మాట్లాడిస్తానని, మిమిక్రి ఆర్టిస్టులతో మోడీ గొంతులో మాట్లాడించి డబ్బులు తీసుకొని అక్కడ కూడా చెల్లింపులు ఎగవేసాడు.

ఈ మాయదారి మోసగాడిని మొన్న అరెస్టు చేసారు పోలీసులు.

ఇతని స్వస్థలం అనంతపురం జిల్లా మహామ్మబాద్ గ్రామం.మొదట మెకానిక్ షాప్ పెటుకున్న రమేష్ ఆ తరువాత ఆర్ఏంపి డాక్టర్ గా పనిచేసి, అపుడే మోసాలు మొదలుపెట్టి, హైదరబాద్ కి మకాం మార్చి, ఎపి మీడియా అనే సంస్థను ప్రారంభించి, ఉద్యోగాల పేరుతో విద్యార్థుల దగ్గర లక్షలు వసూలు చేసాడు.

ఇన్ని మోసాలు కలిపి 200 కోట్లకు పైగా సంపాదించిన రమేష్, నాలుగేళ్ళకి పోలీసుల చేతికి చిక్కాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube