2017-2018లో 2.83 లక్షల కొత్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు

2016 నాటికి కేంద్ర ప్రభుత్వం కోసం 32.84 లక్షలమంది పనిచేస్తున్నారు.2018 నాటికి ఈ సంఖ్యను 35.67 లక్షలకు చేర్చాలని ఆలోచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.ఇందులో భాగంగానే 2.83 లక్షల కొత్త ఉద్యోగాలని అందించబోతోంది.

 2.83 Lakh New Jobs Announced By Central Government-TeluguStop.com

ఈ కొత్త ఉద్యోగాల్లో 1.06.లక్షల ఉద్యోగాలు పోలీసు డిపార్టుమెంటువే కావడం విశేషం.దీంతో పోలీసు ఉద్యోగాల కౌంట్ మొత్తం మీద 11,13,689 గా మారనుంది.

విదేశి వ్యవహారాల శాఖలోకి 2,109 కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి.సివిల్ ఏవియేషన్ లో 1,045 కొత్త ఉద్యోగాలు ఇస్తారు, అలాగే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ లో 20,442 ఖాలీలు పూర్తి చేస్తారట.

మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆండ్ ఫారెస్ట్ లో 9,481 కొత్త ఉద్యోగాలు పుడుతున్నాయి.ఇక డిపార్టుమెంట్ ఆఫ్ స్పేస్ లో మరో 3,068 ఉద్యోగాలు రాబోతున్నాయి.

నదీ జలాల శాఖకి సంబంధించి 3,632 కొత్త ఉద్యోగాలు వస్తాయి.పర్సనల్ మినిస్ట్రీలోకి 2,367 కొత్త ఉద్యోగాలు ఉంటాయి.

ఇక మైన్స్ మినిస్ట్రీకి సంబంధించి మరో 1,351 నూతన ఉద్యోగాలు వస్తాయి.హోమ్ మినిస్ట్రీ సంబంధించిన శాఖల్లో 6,076 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి.

నోటిఫికేషన్స్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మీరో రాయి వేయండి.సెంట్రల్ గవర్నమెంటు ఉద్యోగం అంటే చిన్న విషయం కాదుగా.

నోట్ : ఈ లెక్కలన్ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా విడుదల చేసినవి.ఇందులోని తప్పులకి మాది బాధ్యత కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube