ఏంటి ప్రభాస్ కి 150 కోట్లా !-150cr To Be Spent On Prabhas 1 month

150crores Baahubali 2 Prabhas Next With Sujith Uv Creations Photo,Image,Pics-

బాహుబలికి వందల కోట్ల బడ్జెట్ పెట్టారు ఓకే ! ఎందుకంటే అక్కడ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి. హీరోతో పెద్దగా సంబంధం లేకుండా సినిమాకి పెట్టిన బడ్జెట్ రాబట్టే సత్తా గలిగిన డైరెక్టర్ మన జక్కన్న. ఆ సినిమాతో నిజానికి ప్రభాస్ బాగా లాభపడ్డాడు. కెరీర్లో తొలిసారి రికార్డు ఓపెనింగ్స్, రికార్డు టోటల్ కలెక్షన్లు రుచి చూశాడు. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటి వచ్చింది. ఇప్పుడు హిందీ చిత్రసీమలో తాను హీరోగా సినిమా కూడా తీయగల స్టేజ్ కి ఎదిగిపోయాడు ప్రభాస్. అయితే మాత్రం తదుపరి సినిమా బడ్జెట్ 150 కోట్లా ?

అది కూడా రెండొవ సినిమా తీస్తున్న సుజీత్ లాంటి దర్శకుడితో ! చూస్తోంటే, బాహుబలితో వచ్చిన క్రేజ్ ని పోగొట్టుకోకూడదు అని ప్లాన్ వేసినట్టున్నాడు ప్రభాస్. అవును, యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో, సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే తదుపరి సినిమా బడ్జెట్ అక్షరాల 150 కోట్లు. తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ సినిమా విడుదల అవుతుంది.

ఇదేదో గాలి కబురు అని మాత్రం అనుకోకండి. నిజంగానే నిజం. జాగ్వర్ సినిమాకి 75 కోట్ల బడ్జెట్ అని చెప్పినట్టుగా ఇది పబ్లిసిటి స్టంట్ కానే కాదు. ఇప్పటికే ఈ భారి చిత్రానికి గ్రౌండ్ వర్క్ మొదలైంది. త్వరలోనే మిగితా వివరాలు ప్రకటిస్తుంది యూనిట్.


About This Post..ఏంటి ప్రభాస్ కి 150 కోట్లా !

This Post provides detail information about ఏంటి ప్రభాస్ కి 150 కోట్లా ! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

150cr to be spent on Prabhas, Prabhas, 150Crores, Sujith, UV Creations, Prabhas Next With Sujith, Baahubali 2

Tagged with:150cr to be spent on Prabhas, Prabhas, 150Crores, Sujith, UV Creations, Prabhas Next With Sujith, Baahubali 2150cr to be spent on Prabhas,150Crores,Baahubali 2,prabhas,Prabhas Next With Sujith,Sujith,Uv Creations,,