ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో, 16వ సారి బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ.ఓసారి వీరిద్దరి పోటి చరిత్ర మీద ఓ లుక్కెయ్యండి.
1984 – మంగమ్మ గారి మనవడు vs ఇంటిగుట్టు
ఒక్కరోజులో రెండు సినిమాలు వచ్చాయి.మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
ఇంటిగుట్టు యావరేజ్.విజేత బాలకృష్ణ.
1984 – శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర vs అగ్నిగుండం
ఆరురోజుల తేడాతో రెండు సినిమాలు వచ్చాయి.ఈసారి కూడా బాలకృష్ణ నెగ్గినా, ఈ సినిమా క్రెడిట్ ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే.
1984 – కథానాయకుడు vs రుస్తుం
చిరంజీవి రుస్తుం 7 రోజుల తరువాత విడుదల అయ్యి ఓడిపోయింది.
1985 – చట్టంతో పోరాటం vs ఆత్మబలం
ఒకేరోజు విడుదలయిన ఈ సినిమాల్లో చిరంజీవి చట్టంతో పోరాటం బాలకృష్ణ సినిమాపై పైచేయి సాధించింది.
1986 – భార్గవ రాముడు vs దొంగమొగుడు
రెండు సినిమాలు సమానంగా, సూపర్ గా ఆడాయి.ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి కాదు.
1986 – ముద్దుల కృష్ణయ్య vs మగధీరుడు
బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య బంపర్ హిట్ గా నిలవగా, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలించింది.
1986 – నిప్పులాంటి మనిషి vs కొండవీటి రాజా
వారం వ్యవధిలో విడుదలై, రెండు సినిమాలు బాగా ఆడిన, చిరంజీవి కొండవీటి రాజాతో మరింత పెద్ద హిట్ ని సాధించడంతో ఈ పోటి చిరంజీవి ఖాతాలో వేయవచ్చు.
1986 – అపూర్వ సహోదరులు vs రాక్షసుడు
మరోసారి వారం వ్యవధిలో విడుదలయ్యాయి.ఈసారి కూడా రాక్షసుడు చిత్రంతో చిరంజీవి పైచేయి సాధించారు.
1987 – రాము vs పసివాడి ప్రాణం
వారం వ్యవధిలో రెండు సినిమాలు వచ్చి, రెండు బాగా ఆడాయి.
1988 – ఇన్స్పెక్టర్ ప్రతాప్ vs మంచిదొంగ
ఈసారి కూడా ఇద్దరి సినిమాలు సూపర్ గా ఆడాయి.
1997 – పెద్దన్నయ్య vs హిట్లర్
దశాబ్దకాలం తరువాత ఇద్దరు పోటిపడ్డారు.రెండు సినిమాలు బాగా ఆడాయి.
1999 – సమరసింహారెడ్డి vs స్నేహంకోసం
వారం వ్యవధిలో రెండు సినిమాలు తలపడ్డాయి.బాలకృష్ణ్ సమరసింహారెడ్డితో సరికొత్త రికార్డులు సృష్టిస్తే, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలిచింది.
2000 – వంశోద్ధారకుడు vs అన్నయ్య
మళ్ళీ వారం గ్యాప్.అయితే ఈసారి విజయం చిరంజీవి దే.
2001 – నరసింహానాయుడు vs మృగరాజు
బాలకృష్ణు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంటే, మృగరాజు దారుణంగా విఫలమయ్యింది.
2004 – లక్ష్మీనరసింహ vs అంజి
ఇద్దరు చివరిసారిగా పోటిపడింది ఈ సినిమాలతోనే.ఈసారి కూడా బాలకృష్ణదే విజయం.