Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి-Look Back Into 15 Boxoffice Clashes Of Chiranjeevi And Balakrishna

Featured

ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో, 16వ సారి బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ. ఓసారి వీరిద్దరి పోటి చరిత్ర మీద ఓ లుక్కెయ్యండి.

1984 – మంగమ్మ గారి మనవడు vs ఇంటిగుట్టు

ఒక్కరోజులో రెండు సినిమాలు వచ్చాయి. మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంటిగుట్టు యావరేజ్. విజేత బాలకృష్ణ.

1984 – శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర vs అగ్నిగుండం

ఆరురోజుల తేడాతో రెండు సినిమాలు వచ్చాయి. ఈసారి కూడా బాలకృష్ణ నెగ్గినా, ఈ సినిమా క్రెడిట్ ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే.

1984 – కథానాయకుడు vs రుస్తుం

చిరంజీవి రుస్తుం 7 రోజుల తరువాత విడుదల అయ్యి ఓడిపోయింది.

1985 – చట్టంతో పోరాటం vs ఆత్మబలం

ఒకేరోజు విడుదలయిన ఈ సినిమాల్లో చిరంజీవి చట్టంతో పోరాటం బాలకృష్ణ సినిమాపై పైచేయి సాధించింది.

1986 – భార్గవ రాముడు vs దొంగమొగుడు

రెండు సినిమాలు సమానంగా, సూపర్ గా ఆడాయి. ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి కాదు.

1986 – ముద్దుల కృష్ణయ్య vs మగధీరుడు

బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య బంపర్ హిట్ గా నిలవగా, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలించింది.

1986 – నిప్పులాంటి మనిషి vs కొండవీటి రాజా

వారం వ్యవధిలో విడుదలై, రెండు సినిమాలు బాగా ఆడిన, చిరంజీవి కొండవీటి రాజాతో మరింత పెద్ద హిట్ ని సాధించడంతో ఈ పోటి చిరంజీవి ఖాతాలో వేయవచ్చు.

1986 – అపూర్వ సహోదరులు vs రాక్షసుడు

మరోసారి వారం వ్యవధిలో విడుదలయ్యాయి. ఈసారి కూడా రాక్షసుడు చిత్రంతో చిరంజీవి పైచేయి సాధించారు.

1987 – రాము vs పసివాడి ప్రాణం

వారం వ్యవధిలో రెండు సినిమాలు వచ్చి, రెండు బాగా ఆడాయి.

1988 – ఇన్స్పెక్టర్ ప్రతాప్ vs మంచిదొంగ

ఈసారి కూడా ఇద్దరి సినిమాలు సూపర్ గా ఆడాయి.

1997 – పెద్దన్నయ్య vs హిట్లర్

దశాబ్దకాలం తరువాత ఇద్దరు పోటిపడ్డారు. రెండు సినిమాలు బాగా ఆడాయి.

1999 – సమరసింహారెడ్డి vs స్నేహంకోసం

వారం వ్యవధిలో రెండు సినిమాలు తలపడ్డాయి. బాలకృష్ణ్ సమరసింహారెడ్డితో సరికొత్త రికార్డులు సృష్టిస్తే, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలిచింది.

2000 – వంశోద్ధారకుడు vs అన్నయ్య

మళ్ళీ వారం గ్యాప్. అయితే ఈసారి విజయం చిరంజీవి దే.

2001 – నరసింహానాయుడు vs మృగరాజు

బాలకృష్ణు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంటే, మృగరాజు దారుణంగా విఫలమయ్యింది.

2004 – లక్ష్మీనరసింహ vs అంజి

ఇద్దరు చివరిసారిగా పోటిపడింది ఈ సినిమాలతోనే. ఈసారి కూడా బాలకృష్ణదే విజయం.

Continue Reading

More in Telugu Movie News

  • NEWS

    RGV is not equal to Pawan Kayan’s foot wear – Bandla

    By

    పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ మాస్ సినిమా కావడంతో విమర్శకులు సినిమాకి నెగెటివ్...

  • NEWS

    Negative comments on Shruti Haasan’s figure

    By

    శృతి హాసన్ తన కెరీర్ మొదలుపెట్టి ఏడేళ్ళవుతోంది. వచ్చిన కొత్తల్లోనే “లక్” అనే ఓ హిందీ సినిమాలో బికినీ వేసింది శృతి....

  • NEWS

    Mumaith Khan opens up about her four affairs

    By

    ఐటమ్ బాంబు మమైత్ ఖాన్ గుర్తిందిగా. అలా ఎలా మరచిపోతారు లేండి. పోకిరి సినిమాలోని “ఇప్పటికింకా నా వయసు” అనే పాటతో...

  • NEWS

    Pawan Kalyan Fans attacked Police midnight

    By

    నిన్న అర్థరాత్రి నుంచి హైదరాబాద్ లోని కూకట్ పల్లి ఏరియాలో ఒకటే ట్రాఫిక్ జామ్. రోడ్డంతా వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ లో...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..