చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి-Look Back Into 15 Boxoffice Clashes Of Chiranjeevi And Balakrishna 7 days

Balakrishna Chiranjeevi Gautamiputra Shatakarni Khaidi No.150 Look Back Into 15 Boxoffice Clashes Of And Sankranthi Releases Photo,Image,Pics-

ఖైదీనం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలతో, 16వ సారి బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ. ఓసారి వీరిద్దరి పోటి చరిత్ర మీద ఓ లుక్కెయ్యండి.

1984 – మంగమ్మ గారి మనవడు vs ఇంటిగుట్టు

ఒక్కరోజులో రెండు సినిమాలు వచ్చాయి. మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇంటిగుట్టు యావరేజ్. విజేత బాలకృష్ణ.

1984 – శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర vs అగ్నిగుండం

ఆరురోజుల తేడాతో రెండు సినిమాలు వచ్చాయి. ఈసారి కూడా బాలకృష్ణ నెగ్గినా, ఈ సినిమా క్రెడిట్ ఎక్కువగా సీనియర్ ఎన్టీఆర్ కి ఇవ్వాల్సిందే.

1984 – కథానాయకుడు vs రుస్తుం

చిరంజీవి రుస్తుం 7 రోజుల తరువాత విడుదల అయ్యి ఓడిపోయింది.

1985 – చట్టంతో పోరాటం vs ఆత్మబలం

ఒకేరోజు విడుదలయిన ఈ సినిమాల్లో చిరంజీవి చట్టంతో పోరాటం బాలకృష్ణ సినిమాపై పైచేయి సాధించింది.

1986 – భార్గవ రాముడు vs దొంగమొగుడు

రెండు సినిమాలు సమానంగా, సూపర్ గా ఆడాయి. ఈసారి ఇద్దరిలో ఎవరిది పైచేయి కాదు.

1986 – ముద్దుల కృష్ణయ్య vs మగధీరుడు

బాలకృష్ణ ముద్దుల కృష్ణయ్య బంపర్ హిట్ గా నిలవగా, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలించింది.

1986 – నిప్పులాంటి మనిషి vs కొండవీటి రాజా

వారం వ్యవధిలో విడుదలై, రెండు సినిమాలు బాగా ఆడిన, చిరంజీవి కొండవీటి రాజాతో మరింత పెద్ద హిట్ ని సాధించడంతో ఈ పోటి చిరంజీవి ఖాతాలో వేయవచ్చు.

1986 – అపూర్వ సహోదరులు vs రాక్షసుడు

మరోసారి వారం వ్యవధిలో విడుదలయ్యాయి. ఈసారి కూడా రాక్షసుడు చిత్రంతో చిరంజీవి పైచేయి సాధించారు.

1987 – రాము vs పసివాడి ప్రాణం

వారం వ్యవధిలో రెండు సినిమాలు వచ్చి, రెండు బాగా ఆడాయి.

1988 – ఇన్స్పెక్టర్ ప్రతాప్ vs మంచిదొంగ

ఈసారి కూడా ఇద్దరి సినిమాలు సూపర్ గా ఆడాయి.

1997 – పెద్దన్నయ్య vs హిట్లర్

దశాబ్దకాలం తరువాత ఇద్దరు పోటిపడ్డారు. రెండు సినిమాలు బాగా ఆడాయి.

1999 – సమరసింహారెడ్డి vs స్నేహంకోసం

వారం వ్యవధిలో రెండు సినిమాలు తలపడ్డాయి. బాలకృష్ణ్ సమరసింహారెడ్డితో సరికొత్త రికార్డులు సృష్టిస్తే, చిరంజీవి సినిమా యావరేజ్ గా నిలిచింది.

2000 – వంశోద్ధారకుడు vs అన్నయ్య

మళ్ళీ వారం గ్యాప్. అయితే ఈసారి విజయం చిరంజీవి దే.

2001 – నరసింహానాయుడు vs మృగరాజు

బాలకృష్ణు ఏకంగా ఇండస్ట్రీ హిట్ అందుకుంటే, మృగరాజు దారుణంగా విఫలమయ్యింది.

2004 – లక్ష్మీనరసింహ vs అంజి

ఇద్దరు చివరిసారిగా పోటిపడింది ఈ సినిమాలతోనే. ఈసారి కూడా బాలకృష్ణదే విజయం.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. టీ కాంగ్రెస్ పాలిటిక్స్ చూస్తే క‌ళ్లు తిర‌గాల్సిందే

About This Post..చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి

This Post provides detail information about చిరంజీవి బాలకృష్ణ ఇప్పటికి ఎన్నిసార్లు తలపడ్డారో ఎవరు గెలిచారో చూడండి was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Movie News,Telugu News.

Look back into 15 boxoffice clashes of Chiranjeevi and Balakrishna, Chiranjeevi, Balakrishna,Khaidi No.150, Gautamiputra Shatakarni, 16th time, Sankranthi Releases

Tagged with:Look back into 15 boxoffice clashes of Chiranjeevi and Balakrishna, Chiranjeevi, Balakrishna,Khaidi No.150, Gautamiputra Shatakarni, 16th time, Sankranthi Releases16th time,balakrishna,chiranjeevi,Gautamiputra Shatakarni,Khaidi No.150,Look back into 15 boxoffice clashes of Chiranjeevi and Balakrishna,Sankranthi Releases,,