మనసుకి కత్తెరలు.. ఇప్పటికైనా నచ్చేనా..!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూ మొదటి ప్రయత్నంగా చేసిన సినిమా ఒక మనసు.నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమాను రామరాజు డైరెక్ట్ చేశారు.

 14 Minutes Trimmed For Oka Manasu-TeluguStop.com

నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా పొయెటిక్ వేలో వెళ్లిందని.సాధారణ ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న చిత్రయూనిట్ సినిమాను 14 నిమిషాలు ట్రిం చేశారట.

అది కూడా మొదటి సగంలో ఓ 14 మినిట్స్ ట్రిం చేశారని అంటున్నారు.

ప్రేమకావ్యంగా వచ్చిన ఈ సినిమా మనసుతో చూసే వారికి తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాకు వెళ్లే వారికి నచ్చదు.

ఇక సినిమా టాక్ ఎలా ఉన్నా ఒక మనసు లాంటి సినిమాతో వెండితెరకు పరిచయమయినందుకు నిహారికకు అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి.సినిమాలో హీరో నాగశౌర్య కూడా తన సెటిల్ పర్ఫార్మెన్స్ తో నటుడిగా పరిణితి సాధించాడని అనిపిస్తుంది.

మొత్తానికి సినిమా టాక్ మరి పడిపోకుండా సెకండ్ డే నే ఈ ట్రిమ్మెడ్ వర్షన్ థియేటర్స్ లో అందుబాటులో ఉండేలా చూసుకున్నారు చిత్ర నిర్మాత మధురా శ్రీధర్.మరి కత్తెరలు పడ్డ మనసు అయినా ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube