సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం ‘కబాలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.రంజిత్ దర్శకత్వంలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
‘లింగ’ చిత్రం ఫ్లాప్ తర్వాత రజినీకాంత్ నటిస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాను దర్శకుడు రంజిత్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.అందుకే ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ప్రతి సన్నివేశం కూడా చాలా జాగ్రత్తగా దర్శకుడు తెరకెక్కించాడు.
రజినీకాంత్, రాధిక ఆప్టే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతోంది.
ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా దాదాపు 120 కోట్ల బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు, తమిళ థియేటర్, ఆడియో, శాటిలైట్ రైట్స్ మరియు హిందీ డబ్బింగ్ రైట్స్ కలిపి 120 కోట్లు నిర్మాత ఖాతాలో పడబోతున్నట్లుగా తెలుస్తోంది.
భారీ అంచనాలున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం రజినీకాంత్ కెరీర్లో మరో వంద కోట్ల చిత్రంగా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు.