50 కోట్ల సినిమాకు 120 కోట్ల బిజినెస్‌

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ప్రస్తుతం ‘కబాలి’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.రంజిత్‌ దర్శకత్వంలో తెలుగు మరియు తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 120 Crores Business For Kabali Movie-TeluguStop.com

‘లింగ’ చిత్రం ఫ్లాప్‌ తర్వాత రజినీకాంత్‌ నటిస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాను దర్శకుడు రంజిత్‌ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.అందుకే ఇప్పటికే పూర్తి కావాల్సిన సినిమా షూటింగ్‌ ఆలస్యం అయ్యింది.

ప్రతి సన్నివేశం కూడా చాలా జాగ్రత్తగా దర్శకుడు తెరకెక్కించాడు.

రజినీకాంత్‌, రాధిక ఆప్టే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా దాదాపు 50 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ దృష్ట్యా దాదాపు 120 కోట్ల బిజినెస్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు, తమిళ థియేటర్‌, ఆడియో, శాటిలైట్‌ రైట్స్‌ మరియు హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ కలిపి 120 కోట్లు నిర్మాత ఖాతాలో పడబోతున్నట్లుగా తెలుస్తోంది.

భారీ అంచనాలున్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ చిత్రం రజినీకాంత్‌ కెరీర్‌లో మరో వంద కోట్ల చిత్రంగా తమిళ సినీ వర్గాల వారు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube