12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది

పేరు క్యాట్లిన్ నికోల్ డేవిస్.వయసు 12.

 12 Year Old Live Streamed Her Suicide In Facebook-TeluguStop.com

ఆ వయసులో పిల్లలకి ఆటపాటలు తప్ప మరో ప్రపంచం తెలియదు.స్కూలు ఎగోట్టడం తప్ప మరో తప్పు చేయరు.

కల్మషం లేని మనసు, కల్పితం లేని మాటలు .అల్లరి చేష్టలు.ఇలాంటి వయసులో అల్లారుముద్దుగా పెరగాల్సిన పిల్ల ప్రాణం తీసుకుంది.అది కూడా తండ్రి వలన (సొంత తండ్రి కాదు, తల్లి రెండోవ భర్త).

విషయంలోకి వెళితే నికోల్ తన ఫేస్ బుక్ ఖాతాలో లైవ్ విడియో మొదలుపెట్టింది.అందరిలాగా ఆటలాడుతున్నప్పుడు పెట్టిన విడియో కాదు అది.సూసైడ్ చేసుకుంటూ లైవ్ విడియో పెట్టింది.చెట్టుకి ఊరి వేసుకుంటూ, తన చావుని తానే చిత్రీకరించుకుంది.

మరి ఆ పసి హృదయం ఎందుకు ఆగింది ? తన గుండె చప్పుడిని తానే ఎందుకు ఆపేసుకుంది?

కారణం మరీ దారుణం ! తన తల్లి కట్టుకున్న రెండోవ భర్త, వరుసకి తండ్రి అయిన, కామంతో కళ్ళు మూసుకుపోయినవాడు.పాపం .పన్నెండేళ్ళ పిల్ల అని కూడా చూడకుండా లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడట.ఆ హింస తట్టుకోలేకే ఆత్మహత్య చేసుకుంది.

కాని చనిపోయేముందు ఆ కామాంధుడు చేసిన ఆకృత్యాలని బయటపెట్టింది

ఆ విడియో లైవ్ లో రన్ అవుతుండగానే పోలీసులకి సమాచారం అందటంతో వెంటనే వారు నికోల్ ఆత్మహత్య చేసుకుంటున్న ప్రాంతానికి పరుగులు పెట్టినా, వారు చేరుకునే లోపే తుదిశ్వాసని విడిచిపెట్టింది.

జార్జియాలో జరిగిన ఈ సంఘటన అందరి మనసులని బాధపెట్టింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube