బాహుబలి రికార్డులు మళ్ళీ మొదలు

భారతీయ చలనచిత్ర సంచలనం బాహుబలి, మళ్ళీ రికార్డుల వేట మొదలుపెట్టింది.రెండొవభాగం విడుదల అవడానికి మరో 11 నెలల సమయం ఉన్నా, బయ్యర్లు ఇప్పటినుంచే చిత్ర హక్కులను దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

 Baahubali 2 To Set A Record In Vizag-TeluguStop.com

రేటు ఎంతైనా సరే, బాహుబలి చేతికి చిక్కాల్సిందే అన్నంత కసిగా ఉన్నారు పంపిణీదారులు.

బాహుబలి – ది కంక్లూజన్ ఉత్తరాంధ్ర ( వైజాగ్) హక్కులు ప్రస్తుతానికి 12 కోట్లు పలుకుతున్నాయి.

అంతకన్నా రూపాయి తగ్గేది లేదు అంటున్నారట నిర్మాతలు.రేటు ఎక్కువైనా, వైజాగ్ హక్కులు దక్కించుకునేందుకు క్యూలో నిలిచున్నారు బయ్యర్లు.

ఈరకంగా తన రికార్డు మళ్ళీ తానే బద్దలు కొడుతున్నాడు జక్కన్న.

బాహుబలి మొదటిభాగం 7 కోట్లకి అమ్ముడుపోగా, 9.70 కోట్ల వసూళ్ళు రాబట్టింది.ఇక వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో చిత్రం రానుండటం, సీక్వేల్ కావడంతో, కలెక్షన్లు మరింత జోరుగా ఉంటాయి అనడంలో సందేహం లేదు.

అందుకే ఇంత డిమాండ్ .ఆ డిమాండ్ ని బట్టే రేటు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube