ఈవిడ వయసు 106 .. లక్షలు సంపాదిస్తోంది .. ఎలా అంటే

ఒక మనిషి 80 సంవత్సరాలు బ్రతికితేనే గొప్ప అనుకునే రోజులివి.70 ఏళ్ళు దాటగానే పిల్లల మీద అన్నిరకాలుగా ఆధారపడతారు వృద్ధులు.కాని మస్తానమ్మ అందరిలాంటి వృద్ధురాలు కాదు.ఆమె వయసు 106.ఆంధ్రపదేశ్ లోని కృష్ణజిల్లా గుడివాడకి వెళ్లి మస్తానమ్మ అనే పేరు చెబితే చాలు, ఇంటికి తీసుకెళతారు అక్కెడి జనాలు.అంతలా ఫేమస్ అయిపోయింది.

 106 Year Old Indian Youtuber Is Earning In Lakhs With Cooking Videos-TeluguStop.com

అయినా, వరల్డ్ ఫేమస్ అయిన ఆవిడని సొంతూరులో గుర్తుపట్టకుండా ఎలా ఉంటారు.ఇంతకి ఈవిడ వరల్డ్ ఫేమస్ ఎలా అయ్యింది? 106 ఏళ్ళ వయసులో ఇప్పుడు లక్షలు ఎలా సంపాదిస్తోంది?

యూట్యూబ్ ఇప్పుడు చాలామందికి జీవనాధారం.ప్రాంక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సీరీస్, వంట వీడియోలు, సినిమా రివ్యూలు, వార్తలు, కామెడి షోలు, మొబైల్ మార్కేట్ సమాచారం, చివరకి పాఠాలు కూడా వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతున్నారు.వీడియో క్లిక్ అయి వైరల్ వెళితే ఇండియా నుంచి ఇటు కెనడా వరకు, అటు ఆస్ట్రేలియా వరకు, ఎవరికి ఆసక్తిగా అనిపిస్తే వారు, ఎవరికి అవసరం ఉంటే వారు చూస్తారు.

మిలియన్లు కొద్దీ వ్యూస్ వస్తే లక్షల్లో డబ్బులు చేతికొస్తాయి.

ఈ మస్తనమ్మ వంటలు బాగా చేస్తుంది.సహజంగా పొయ్యి మీద, అన్ని సహజమైన వంట సరుకులే వాడుతూ, తెలుగు పల్లే వంటలు రుచికరంగా వండుతుంది.ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కాని ఆవిడ మనవడు లక్ష్మణ్ కి ఎందుకో ఈవిడ వంట చేసేటప్పుడు వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టాలనే ఆలోచన వచ్చింది.

దాంతో ఆమెకి సమాచారం ఇవ్వకుండానే వంట చేస్తుండగా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టేసారు.వాళ్ళు ఊహించనట్టుగా ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది.

అక్కడినుంచి ఈ కథ మొదలైంది.

ఎగ్ దోసా, పుచ్చకాయలో చికెన్, చికెన్ ఫ్రై, గుడ్డుకూర, పాట్ బిర్యాని, కీమా బిర్యాని, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఎన్నోరకాల వంటలు పొయ్యి నీద సహజ పద్ధతుల్లో వండుతూ, వాటిని యూట్యూబ్ లో పెడుతూ పేరుతో పాటు డబ్బు సంపాదిస్తున్నారు బామ్మ – మనవలు.

ఇప్పుడు ఈవిడ యూట్యూబ్ ఛానెల్ “country foods” కి 4 లక్షల 25 వేలకి పైగా సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చిన వీడియోలు ఉన్నాయి.

మన దేశం నుంచే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాల వారు ఈ మస్తానమ్మ చేసే వంటకాలను చూసి ప్రయోగాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube