తిరుమల వెళుతున్నప్పుడు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు

చాలా మంది ఏడుకొండల వాడి దర్శనం కోసం తిరుమల వెళుతూ ఉంటారు.తిరుమల వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను తెలుసుకుంటే యాత్ర సులభంగా అవుతుంది.ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

 10 Things You Must Know Before Going To Tirumala-TeluguStop.com

1.తిరుమలలో స్వామివారిని దర్శించటానికి ముందు పుష్కరిణిలో స్నానము చేసి వరాహ స్వామికి దర్శనం చేసుకోవాలి.

2.పుష్కరిణిలో స్నానము చేసే సమయంలో సబ్బు,షాంపూ వంటి వాటిని ఉపయోగించకూడదు.

3.స్వామివారి దర్శనానికి తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులను ధరించాలి.

4.తిరుమలలో ఆచార,సంప్రదాయాలను పాటించాలి.

5.తిరుమలలో ధూమపానం, మద్యపానం, మాంసాహారం పూర్తిగా నిషిద్ధం.

6.తిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్, కేమెరా, ఆయుధాలు వంటి వాటిని తీసుకువెళ్లకూడదు.

7.తిరుమల సమీపంలోని ఆకాశ గంగ, పాపవిశానం తీర్థాల్లోనూ స్నానం చేయండి.

8.తిరుమల ఆలయంలో ఓం శ్రీ వేంకటేశాయనమ అని మనస్సులో శ్రీవారిని స్మరించాలి.సాధ్యమైనంతవరకు నిశబ్దంగా ఉండాలి.

9.తిరుమలలో ఉన్నప్పుడు అపరిచితులను నమ్మి వసతి గృహాల్లోకి రానీయకూడదు.

10.శ్రీవారి దర్శనం కోసం , వసతి కోసం దళారీలను ఆశ్రయించకూడదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube