Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

బరువు తొందరగా తగ్గటానికి ఈ 10 చిట్కాలు చాలు -10 Rules For Immediate Weight Loss

ప్రపంచాన్ని వణికిస్తున్న సమస్య ఉబకాయం..అధిక బరువు..మనం తినేసేది తినేయాలి..జబ్బులు మటుకు రాకూడదు అంటే ఎలా..ఒక బెలూన్లో గాలి ఎంతవరకూ పడుతుంది..దాని సామర్ధ్యం ఉన్నంత వరకూ..లేకపోతే పేలిపోతుంది..ఇదే సూత్రం మనకి వర్తించదా..మనం తినే తిండి చాలా లిమిట్ గా ఉండాలి..అధిక మోతాదులో తింటే..దాని ఫలితం అప్పటికప్పుడు చూపించక పోయినా దీర్ఘకాలికంగా తన ప్రభావాన్ని చుపిస్తుంది.ఇప్పుడు చాలా మంది బరువు తగ్గడం మీదనే దృష్టి పెడుతున్నారు..వారు కొన్ని కొన్ని నియమాలు పాటిస్తే చాలు. కొన్ని పద్దతుల ద్వారా బరువుని తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు వైద్యులు. వీటిని పాటించడం ద్వారా తొందరగా బరువుని తగ్గించుకోవచ్చట.

1. మత్తు పదార్థాల వలన అదనపు కొవ్వు చేరి శరీర బరువు పెరుగుతుంది. దీంతో సమస్యలు తలెత్తుతాయి.

2. రోజుకు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తీసుకోవడం వలన క్యాలరీ ఇన్‌టెక్ తగ్గుతుంది. శరీరంలో మాలిన్యాలు పేరుకుపోవు. ఇది బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

3 ఇంటి పరిశుభ్రత, గార్డెనింగ్ లాంటి పనుల వలన శరీరానికి తగిన వ్యాయామం జరుగుతుంది.

4. చాయ్, కాఫీ, కూల్‌డ్రింక్‌లు సేవించడం తగ్గించండి. వీటిలో షుగర్‌తో పాటు కనిపించని క్యాలరీలు అధికమోతాదులో ఉంటాయి.

Continue Reading
To Top