వాట్సాప్ లో కొత్తగా 10 ఆప్షన్లు

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక జనాభా వాడుతున్న మెసెంజర్ వాట్సాప్.ఇది మెసెజ్ చేయడానికి సులభంగా, ఆకర్షణీయంగా ఉండటమే దీనికి ఎదుగుదలకు కారాణం.

 10 New And Future Options From Whatsapp-TeluguStop.com

బ్లాక్ బెర్రీ ఫోన్ల ఆధిపత్యానికి తెరదించి, ఆండ్రాయిడ్ యూజర్లు, ఐఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది ఈ ఆప్.

ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్స్ తన యూజర్స్ కి అందిస్తూ, మెసేజింగ్ ప్లాట్‌ఫారంలో మకుటంలేని మహారాజుగా ఎదగిన వాట్సాప్ కొన్ని కొత్త ఆప్షన్స్ అల్రెడి ఇస్తోంది మరికొన్ని కొత్త ఆప్షన్స్ అందుబాటులోకి తేనుంది.అవేంటి చూద్దాం.

1) కాల్ బ్యాక్ :.

వాట్సాప్ లో ఫోన్ కాల్ అప్షన్ గత సంవత్సరమే ఇచ్చినా, కాల్ బ్యాక్ ఆప్షన్ మాత్రం ఇవ్వలేదు.సరికొత్తగా వెర్షన్ 2.16.189 లో ఈ ఆప్షన్ ఇస్తున్నారు.

2) మెసేజ్ కోట్ :.

డిస్కషన్ బోర్డ్స్ లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ కోట్ ఆప్షన్, ఆ తరువాత ట్విట్టర్లోకి వచ్చేసింది.ఇప్పుడు వాట్సాప్ కూడా వేరే యూజర్ మెసెజ్ ని కోట్ చేసే అవకాశం కల్పిస్తోంది.ఓసారి అప్డేట్ చేయండి.ఈ ఆప్షన్ అల్రెడి వచ్చేసింది.

3) కొత్త ఫాంట్స్ :.

ఏళ్ళుగా ఒకే ఫాంట్ వాడి వాడి బోర్ కొట్టేసిందా … ఫాంట్ మార్చకోని టైప్ చేసే ఆప్షన్ కూడా ఇచ్చేసింది వాట్సాప్.

4) వాయిస్ మేయిల్ :.

ప్రతీసారి ఫోన్లో మాట్లాడటం కుదరదు కదా.అందుకే వాయిస్ మేయిల్ ని అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్.పేరు మారిందే కాని ఇదేమి కొత్త ఆప్షన్ కాదు.ఇంతకముందు కూడా మెసేజ్ ని రికార్డు చేసి పంపించగలిగేవాళ్ళం.

5) ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ :.

ఈ అప్డేట్ ఈ మధ్యే వచ్చింది.ఇద్దరు యూజర్లు పక్కనే ఉండి స్కానింగ్ ద్వారా ఎండ్ టూ ఎండ్ ఎన్క్రిప్షన్ చేసుకోవాలి.ఇలా చేస్తే, మీ మెసేజెస్ ఏ థర్డ్ పార్టీ వాళ్ళు చదవలేరు.

6) మెన్షన్స్ :.

ఫేస్ బుక్, ట్విట్టర్ అంతలా ఫేమస్ అవడానికి కారణం మనకు కావాల్సిన యూజర్ ని మెన్షన్ చేసే ఆప్షన్ ఉండటమే.వాట్సాప్ గ్రూప్ చాట్ లో ఈ ఆప్షన్ లేక, చాలా ఇబ్బందిపడేవారు.ఇప్పుడు ఆ లోటు కూడా తీరుస్తోంది వాట్సాప్.

7) మ్యూజిక్‌ షేరింగ్ :.

ప్రత్యేకంగా మ్యూజిక్ షేరింగ్ ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకురానుంది వాట్సాప్.ఇక మీకు ఇష్టమైన సంగీతం మీరు వింటూనే, మీ స్నేహితులకి వినపించవచ్చు.

8) GIF సపోర్ట్ :.

ట్విట్టర్ దెబ్బకు ఫేస్ బుక్ కూడా GIF ఫైల్స్ ని ప్లే చేయడం మొదలుపెట్టింది.ఇప్పుడు వాట్సాప్ కూడా పోటీలో నిలబడేందుకు GIF ఫైల్స్ ని సపోర్టు చేస్తుంది.

9) వీడియో కాలింగ్ :.

ఎక్కడా తగ్గకుండా వీడియో కాలింగ్ ఆప్షన్ ని కుడా తీసుకువస్తోంది వాట్సాప్.ఈ ఆప్షన్ ని వాట్సాప్ ఇప్పటికే చాలామంది వినియోగదారులకు ఇచ్చి మళ్ళీ తీసేసిందని టాక్.

10) పెద్ద ఇమోజి :.

వాట్సాప్ లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఇమోజి.త్వరలోనే ఇమోజి హావభావాలు మరింత పెద్దగా డిస్ప్లే అవనున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube