కిడ్నీ ఫేల్యూర్ కి సంబంధించిన 10 ముఖ్య సంకేతాలు

మన ఇంట్లో ప్రతి రోజు‌ చెత్త జమ అవుతుంది.ఆ చెత్తను అలాగే ఉంచేస్తే ఎలా ఉంటుంది? భోజనం తరువాత పాత్రలను శుభ్రపరచకుండా అలానే వదిలేస్తే ఎలా ఉంటుంది? కుళ్లిపోయిన పండ్లను, కూరగాయలను, ఆహార పదార్థాలను బయట పడేయకుండా అలానే వదిలేస్తే ఎలా ఉంటుంది? ఇలా అన్ని అపరిశుభ్రంగా వదిలేస్తే ఎంత అనారోగ్యం? కిడ్నీలు సరిగా పనిచేయకపోతే మన శరీరం లోపల కూడా అలాంటి పరిస్థితే ఉంటుంది.మీ కిడ్నీలు జాగ్రత్త.అవి ప్రమాదంలో ఉన్నాయని ఈ లక్షణాలను బట్టి తెలుసుకొని, వాటిని రక్షించుకోండి.

 10 Important Signs Of Kidney Failure-TeluguStop.com

* వికారం బాగా ఇబ్బంది పెడుతుంది.తరచుగా వాంతులు రావచ్చు.

రక్తంలో వ్యర్థాలు బాగా పేరుకుపోవడం వలన ఇలా జరుగుతుంది

* చర్మంపై దద్దుర్లు పుట్టవచ్చు.దురద పెరిగిపోతుంది.

చర్మం పై ఎలాంటి చికిత్స వాడినా ఫలితం ఉండదు.ఎందుకంటే అసలు సమస్య లోపలినుంచి ఉంది కాబట్టి

* కిడ్నీలు చెడిపోవటం వలన ద్రవపదార్థాలు అన్ని బయటకు రావు ‌‌‌‌.

ద్రవాలు ఎక్కువగా జమ అవటం వలన శరీర భాగాలు ఉబ్బుతాయి.ముఖ్యంగా ముఖం పై, పాదాల్లో వాపు కనిపిస్తుంది

* ఉష్ణోగ్రత ఎక్కువే ఉన్నా, ఎండ కొడుతున్నా, మిగతా వారికి ఉక్కపోతగా ఉన్నా, మీకు మాత్రం చలి వేస్తుంది ‌.కిడ్నీలు ఫెయిల్ అవడం వలన రక్తహీనత సమస్య వస్తుంది.రక్తహీనత వలన ఎక్కువ ఉష్ణోగ్రతలో కూడా మీ శరీరం చలిగా ఉంటుంది.

* కిడ్నీలు ఫెయిల్ అవడం వలన రక్తంపై, రక్తనాళాలపై ప్రభావం పడుతుందని తెలుసుకున్నారు.ఇలా జరగడం వలన శరీర భాగాలకు ఆక్సిజన్ సరిగా చేరదు.శ్వాస సంబంధిత సమస్యలు కూడా వస్తాయి

* ఆక్సిజన్ మన మెదడుకి సరిగా అందకపోవడం వలన మతిమరపు పెరిగిపోతుంది.పెద్ద కారణం లేకుండా తలనొప్పి మాటిమాటికీ వస్తుంది.

ఆలోచనా శక్తి తగ్గుతుంది, ఏకాగ్రత నశిస్తుంది

* ఇతరులకి రుచిగా ఉండే ఆహారపదార్థాలు మీకు రుచికరంగా అనిపించవు.మీ నాలుక రుచిని పసిగట్టే శక్తి క్రమంగా కోల్పోతూ ఉంటుంది.

రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోవడం వలన ఇలా జరుగుతుంది

* టాక్సిన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, కిడ్నీ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే ఈ వ్యర్థ పదార్థాలు శరీరంలోంచి బయటకు పోవడం కష్టమైపోతుంది.టాక్సిన్స్ శరీరంలో జమ అవుతున్నకొద్దీ ఒకటి కాదు రెండు కాదు శరీరంలోని అన్ని భాగాలు తమ శక్తిని కోల్పోతూ ఉంటాయి

* మూత్ర విసర్జనలో సమస్యలు తలెత్తుతాయి.

మూత్రం రంగు చిక్కగా ఉంటుంది.దుర్వాసన పెరుగుతుంది.

టాక్సిన్స్ ఎక్కువ అవడం వలనే ఇలా జరుగుతుంది

* కిడ్నీలు ఉండే భాగం లోనే కాదు, వెనక వీపు భాగంలో కూడా విపరీతమైన నొప్పి వేస్తోంది.కొన్నిసార్లు ఈ వెన్నునొప్పి అసాధారణ స్థాయిలో ఉంటుంది.

ఇలా తరచుగా జరిగితే అనుమానపడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube