సైరా నరసింహారెడ్డి బడ్జెట్ ఏంతో తెలిస్తే దిమ్మ దిరిగిపోతుంది

మెగాస్టార్ పునరాగమనం ఘనంగా జరిగింది.150 వ చిత్రం ఖైదినం 150 టాలివుడ్ రికార్డుల దుమ్ము దులుపోతూ బాహుబలి 1 ఓపెనింగ్స్ ని, శ్రీమంతుడు లైఫ్ టైంని దాటేసి కొత్త నాన్ – బాహుబలి గ్రాసర్ గా నిలిచింది.లోకల్ రికార్డులు క్రాస్ చేసిన మెగాస్టార్ ఈసారి నేషనల్ రికార్డులపైన కన్నేశారు.అందుకే 151వ చిత్రంగా భారి బడ్జెట్ సినిమా “సైరా నరసింహారెడ్డి”ని ఎంచుకున్నారు.మెగాస్టార్ ప్రధాన పాత్రలో, నయనతార హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్ ప్రధాన తారాగణంగా కనిపిస్తారు.ప్రతిష్టాత్మకంగా, బాహుబలికి ధీటుగా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

 Sye Ra Narasimhareddy Budget-TeluguStop.com

భారీ అంటే మీరు ఊచించని రీతిలో.

స్పైడర్ బడ్జెట్ 100 కోట్లు.

సాహో బడ్జెట్ 150 కోట్లు.రాజమౌళి లేకుండా ఇంత బడ్జెట్ ఏంట్రా బాబు అని మీరు ఆశ్చర్యపోతూ ఉండవచ్చు.

మరి సైరా నరసింహారెడ్డి బడ్జెట్ ఏంతో తెలుసా? ఇంచు మించు బాహుబలి మొదటి భాగం అంత.ప్రస్తుతం వింటున్న లెక్కల్లో 190-200 కోట్ల బడ్జెట్ దీనిమీద పెట్టనున్నారు.అంత బడ్జెట్ అంటే రామ్ చరణ్ ఒక్కడి వల్లే కాదు కదా.అందుకే 2.0 ని నిర్మిస్తూ, స్పైడర్ ని తమిళంలో కోనేసిన లికా ప్రొడక్షన్స్ ఈ నిర్మాణంలో భాగస్వాములు కానున్నారు.

ఇది స్పైడర్ మాదిరి బహుభాష చిత్రం కాదు.

కాని తమిళం, హిందీ, మలయాళంలోకి డబ్ అవుతుంది.మెగాస్టార్ ఓ సరికొత్త గెట్ అప్ లో కనిపిస్తారు.

ఆ లుక్ ఎలా ఉండబోతోందో మనం ఇప్పటికే పోస్టర్ లో చూసాం.ఇందులో గ్రాఫిక్స్ హంగులు, భారి యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.

హాలివుడ్ భారి చిత్రాలు స్పైడర్ మెన్, వార్ లార్డ్స్ సినిమాలకు పనిచేసిన యాక్షన్ టెక్నిషియన్స్ ని ప్రత్యేకంగా రప్పిస్తున్నారు.సాహోలో కూడా ఇదే మాదిరి హాలివుడ్ యాక్షన్ దర్శకులు పనిచేస్తున్నారు.

ఇదండీ .మొత్తానికి తెలుగు సినిమా రూపురేఖలు మారిపోతున్నాయి.స్పైడర్, సాహో, ఇప్పుడు సైరా.నరసింహారెడ్డి.అన్ని భారి బడ్జెట్ సినిమాలే.చూద్దాం, బాహుబలి క్రియేట్ చేసిన ఆ హైప్ ని ఏ సినిమా అందుకుంటుందో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube