బాహుబలి రాణా సిని కెరియర్ లో ఒక మైలురాయి.ఆ సినిమాలో రాణా ఫిజికల్ ఫిట్నెస్ చూసిన వాళ్లందరూ ఔ రా అని ముక్కున వేలేసుకున్నారు.
అంతగా తన హైటు కి తన శరీరానికి తగ్గట్టుగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు రాణా.అందుకే ఎన్ని పాత్రలు వచ్చినా తనకి నప్పే వాటినే ఎంచుకుంటున్నాడు.
కొత్త కొత్త పాత్రలతో ఇప్పుడు తన అభిమానులని అలరించబోతున్నాడు రాణా.
గుణశేఖర్ ఎంతగానో ఇష్టపడి రాసుకున్న హిరణ్యకశిపుడు పాత్ర రానాని వరించింది.
ఇప్పుడు తాజాగా మరో మైథలాజికల్ మూవీ లో ఓ క్యారక్టర్ రానా చేయాలని ఆఫర్ వచ్చింది.అదేమిటంటే ఎప్పటినుండో “రావణ” సినిమా ని తీయాలని మోహన్ బాబు ఫ్యామిలీ అనుకుంటోంది ఇన్నాళ్ళకి ఈ ప్రయత్నం పట్టాలెక్కించాలని భావించారు.
ఈ సినిమాలో రావణ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు.బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.
ఇందులో హనుమంతుడి పాత్రని రానా చేస్తే బాగుంటుంది అని రానా ని అడుగగా వెంటనే ఒప్పుకున్నాడు అని సమాచారం.రెండేళ్లుగా ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.
అంతర్జాతీయ స్థాయిలో సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకి పనిచేస్తున్నారట.ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు.
రాఘవేంద్రరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.ఏది ఏమైనా ఈ సినిమాలో ఆంజనేయుడి పాత్రలో రానా ఫిక్స్ అని తెలుస్తోంది.
ఈ సినిమా ఎప్పుడు పట్టలేక్కుతుందో వేచి చూడాలి మరి
.