మెగాస్టార్ బర్త్ డే .. మరో హీరో తరం కాని రికార్డుల లిస్టు చూడండి

కొణిదెల శివశంకర వరప్రసాద్.ఒకప్పుడు ఒక అనామకుడు.

 Happy Birthday Chiranjeevi Few Unbelievable Records In Megastars Career 1-TeluguStop.com

మరి ఇప్పుడు? మెగాస్టార్ చిరంజీవి.ఎందరో అనామకులకి స్ఫూర్తి.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు.ఎవరు గ్రాండ్ ఫాదర్ కాదు.

ఎంట్రీ ఇచ్చిన సమయానికి ఎన్టీఆర్, అక్కినేని, కృష్ణ లాంటి ఉద్దండులు ఉన్నారు ఇండస్ట్రీలో.ఆ సమయంలో మరి ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ పీక్స్ లో ఉన్నారు.

ఆ మాస్ ప్రభాజనాన్ని తట్టుకొని నిలబడటం మాత్రమే కాదు, అంతకుమించి ఎదిగిపోయారు మెగాస్టార్.చిరంజీవి అనే పేరు వినగానే మనకు కోట్లాదిమంది అభిమానుల కోలాహలం, రికార్డులు గుర్తుకు వస్తాయి కాని, వీటికి మించి చిరంజీవి అంటే ఒక గొప్ప నటుడు.

గ్యాంగ్ లీడర్, ఖైదీ, ఇంద్ర లాంటి సినిమాలే మనకు మొదట గుర్తుకురావొచ్చు, కాని ఒక ఆపద్బాంధవుడు, ఒక స్వయం కృషి, ఒక అభిలాష తీసింది కూడా ఆయనే.అందుకే చిరంజీవి స్థానం ప్రత్యేకం.

మెగా స్టార్ అయినా, ఓ గొప్ప నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.అభినయంతో కూడా మెప్పించే అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు.

పదేళ్ళు గ్యాప్ వస్తే మరో హీరో అయితే మినిమం ఓపెనింగ్స్ రాబట్టడం కూడా కష్టం.కాని బాహుబలికి మించిన ఓపెనింగ్స్ రాబట్టి ఈ తరం హీరోల రికార్డులు అన్ని గాలి ఉదేసినట్టు ఉదేసారు మెగాస్టార్.ఆ నెం.1 హీరో పుట్టినరోజు ఈరోజు.ఈ సందర్భంగా, ఆయన కెరీర్ లోని కొన్ని అద్భుతమైన రికార్డులు ఇవిగో.

* యావత్ భారత దేశ సినీ చరిత్రలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ అందించిన నటుడు చిరంజీవి.

ఏకంగా 8 ఇండస్ట్రీ హిట్స్ కొట్టారు మెగాస్టార్.ఇన్నేసి ఇండస్ట్రీ హిట్స్ ఆమీర్ ఖాన్ కి కూడా లేవు.

ఆమీర్ కెరీర్ లో 5 ఉన్నాయి

* ఆస్కార్ అవార్డుల వేడుకకి ఆహ్వానం పొందిన తోలి తెలుగు నటుడు మెగాస్టార్.ఇంకో హీరోకి సాధ్యపడే విషయమేనా ఇది?

* దక్షిణాదిలో తోలి 10 కోట్ల షేర్ చిత్రం మెగా స్టార్ దే.ఘరానామొగుడు ఈ ఘనత సాధించింది

* 90లలో యావత్ భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా చరిత్ర సృష్టించారు చిరంజీవి.అమితాబ్ బచ్చన్ కన్నా ఎక్కువ రేమ్యునరేష్ తీసుకున్నారు ఓ దశలో.అప్పుడే ఆయన పారితోషికం 1.25 కోట్లు

* ఇదే రికార్డు మళ్ళీ ఇంద్రతో సృష్టించారు చిరంజీవి.ఆమీర్ ఖాన్ పారితోషికం 6 కోట్లను దాటుతూ, 7 కోట్లు తీసుకున్నారు చిరంజీవి.ఇలా ఒక దక్షిణాది నటుడు బాలివుడ్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవడం, కేవలం మెగాస్టార్ విషయం లోనే జరిగింది

* సగటు లెక్కలు తీసుకుంటే, తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక బ్లాక్ బస్టర్ రేటు, సూపర్ హిట్ రేట్ కలిగిన నటుడు చిరంజీవి.

ఇక ఇండస్ట్రీ హిట్స్ ల రికార్డు ఎలానో ఉంది

* వెంకటేష్ మరియు కమల్ హాసన్లతో “నంది ఉత్తమ నటుడు” రికార్డుని పంచుకుంటున్నారు చిరంజీవి.ఈ ముగ్గురిని మూడు సార్లు నంది అవార్డు వరించింది.

ఇప్పటితరంలో నటుల్లో మహేష్ బాబు రెండు ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు

* బాహుబలి ఓపెనింగ్స్ ని, అలాగే బాహుబలి ఫుల్ రన్ ని ఒక ఏరియాలో (ఉత్తరాంధ్ర) దాటేసిన రికార్డు మెగాస్టార్ దే.ఈ రికార్డు భవిష్యత్తులో మళ్ళీ ఆయనే బ్రేక్ చేస్తారేమో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube