స్మార్ట్ ఫోన్ వాడడం మనందరికీ బాగా అలవాటు.ఎలాంటి తత్తరపాటు లేకుండా చాలా సులువుగా ఏది పడితే అది ఆంగ్లంలో చాలా సులువుగా రాసేయగలరు.
కానీ తెలుగులో రాయాలంటేనే ఇబ్బందికి గురవుతాం.ఎంతైనా మొబైల్లో తెలుగు టైప్ చేయడం చాలా కష్టం.
mobile లో తెలుగు రాయాలంటే చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది.దాంతో తెలుగులో ఏం రాయాలన్నా చిరాకు చికాకు వచ్చేస్తుంది.
మనం మాట్లాడింది ఇంగ్లీషులో మొబైల్లో దానికదే అవడం మీరు చూసే ఉంటారు.ఇలాంటి ఆప్షన్ తెలుగులో కూడా ఉంటే మన పని ఎంత సులువవుతుంది.
ఇలాంటి ఆప్షన్ తెలుగులో కూడా ఉందండోయ్.దాని రాక మీకు తెలియలేదు అంతే.
అందుకే తెలుగులో మాట్లాడితే దానికదే టైప్ అవడం ఎలానో మీకు తెలియజేస్తున్నాము.
* మొదట ప్లే స్టోర్ లోకి వెళ్లి గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
దాంట్లోకి మీ జీమెయిల్ ఐడీ ద్వారా సైన్ ఇన్ అవ్వండి.
* ఇప్పుడు G-board అనే గూగుల్ కీ బోర్డును డౌన్లోడు చేసుకోండి.
ఇదే జీ బోర్డులో తెలుగు కీ బోర్డు కూడా ఉంటుంది.దానిని install చేసుకోండి.
* ఇక గూగుల్ లోకి వెళ్లి వాయిస్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి.అందులో ఇంగ్లీషు అప్పటికే సెలెక్ట్ చేసి ఉంటుంది.
ఇప్పుడు అక్కడ మీరు ఇంగ్లీషు తీసేసి కొత్తగా వచ్చిన తెలుగు ఆప్షన్ ని ఎంచుకోవాలి.
* ఇప్పుడు మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి లాంగ్వేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు జీ బోర్డు తెలుగుని మీ డిఫాల్ట్ కీబోర్డ్ గా ఎంచుకోండి.అంతే పని పూర్తయిపోయింది.
* ఇప్పుడు facebook, twitter, whatsapp లేదా gmail ఎకౌంటు ని ఓపెన్ చేసి, కుడివైపు ఉండే mike సింబల్ మీద క్లిక్ చేయండి.ఇక మీరు ఏం మాట్లాడితే అదే దానికదే తెలుగులో టైప్ అయిపోతుంది.
* అయితే మీరు మాట్లాడేది పూర్తి స్పష్టత తో మాట్లాడాలి.అప్పుడే బోర్డు దాన్ని స్పష్టతతో అర్థం చేసుకోని ఉన్నది ఉన్నట్టుగా టైప్ చేస్తుంది.