పాపం ఎన్టీఆర్ రాశీతో అలా చేయలేదు .. అంతా అబద్ధం

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నవారిలో తమకి తామే డబ్బింగ్ చెప్పుకునే నటీమణులు ఎవరు అంటే వేళ్ళ మీద లెక్కపెట్టుకోవడం కూడా కష్టం.స్వచ్చమైన తెలుగు అమ్మాయిలు కలర్స్ స్వాతి, ఇషా లాంటి వారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నా ఏమి లాభం, వారికి సరిగా అవకాశాలే ఇవ్వరు.

 Ntr Didnt Interfere In Rashi Khannas Matter-TeluguStop.com

ముంబాయి నుంచి, పంజాబ్ నుంచి వచ్చిన భామలు తెలుగు నేర్చుకోమ్మంటే నేర్చుకోరు.రకుల్, రాశీ ఖన్నా, ఇలా ఇద్దరుముగ్గురికి తెలుసు బాగానే వచ్చు.16-17 ఏళ్ళుగా పనిచేస్తున్న శ్రియకి, పదేళ్ళుగా పనిచేస్తున్న కాజల్ లాంటి వారికి ఇప్పటికీ తెలుగు రాదు‌.

ఇక రాశీ ఖన్నా టాపిక్ వచ్చింది కాబట్టి చెబుతున్నాం, జైలవకుశ సినిమా కోసం మొదట రాశీ సొంతంగా డబ్బింగ్ చెప్పాలి అనుకుందట.

తెలుగు ఫర్వాలేదు అనిపించేలా మాట్లాడగలిగినా, ఇప్పటివరకు రాశీ డబ్బింగ్ చెప్పుకోలేదు.నాన్నకు ప్రేమతోలో రకుల్ మాదిరిగా రాశీ కూడా ఓ ప్రయత్నం చేద్దామనుకుంది.కాని రాశీ ప్రయత్నాన్ని ఎన్టీఆర్ స్వయంగా అడ్డుకున్నాడని, కొంచెం కోపంగానే రాశీతో ఇలాంటి ఆలోచన తన సినిమా వరకు మానుకోమని, నీ వలన నా సినిమా పాడు కాకూడదు అన్నాడని, ఏవేవో రూమర్లు పుట్టుకొచ్చాయి.

అసలు విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ ఈ విషయంలో అసలు జోక్యమే చేసుకోలేదు.

మొదట రాశీ డబ్బింగ్ చెప్పాలనుకున్న మాట వాస్తవమే.కాని రాశీ ప్రయత్నాన్ని సున్నితంగా తిరస్కరించింది ఎన్టీఆర్ కాదు, డైరెక్టర్ బాబీ.

నాన్నకు ప్రేమతోలా విదేశాల్లో ఉండే మోడ్రన్ అమ్మాయి క్యారెక్టర్ అయితే ప్రయత్నం చేయొచ్చు కాని, ఈ సినిమాలో రాశీది అలాంటి క్యారక్టర్ కాదుగా, అందుకే ఇంకొంచెం పట్టు వచ్చేదాకా ఆగమన్నారట.ఇదీ జరిగింది.

పాపం, అనవసరంగా ఎన్టీఆర్ మీద లేని వార్తలు సృష్టించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube