పాపం .. ఈ హీరోతో ముద్దు అంటే హీరోయిన్లు వద్దు అంటున్నారు

ఒక సినిమా ఒప్పుకున్నామంటే అందులో సహనటులు నచ్చినా, నచ్చకపోయినా నటించాల్సిందే.అయితే అడ్జస్ట్ అయినా అవ్వాలి, లేదంటే సినిమా నుంచి తప్పుకోవాలి.

 Actresses Not Wanting To Kiss This Bolly Hero 1-TeluguStop.com

కొన్నిసార్లు రొమాంటిక్ సన్నివేశాలు చేయాల్సి ఉంటుంది.అప్పుడు హీరోతో సీన్ చేయడం హీరోయిన్ కి ఇష్టం లేకపోయినా, హీరోయిన్ తో సీన్ చేయడం హీరోకి ఇష్టం లేకపోయినా అడ్జస్ట్ చేసుకోవాల్సిందే.

ముద్దు సన్నివేశం చేసేటప్పుడు ఆ హీరోయిన్ ఎదో తిని వచ్చిందని, ఆ హీరో నోటి దుర్వాసన తట్టుకోలేకపోయానని .ఇలా హీరోహీరోయిన్లు కంప్లయింట్స్ చేయడం కూడా చూసాం మనం.ఒక్కోసారి హైజీన్ సమస్యలు ఉంటే, కొన్నిసార్లు సహనటి లేదా సహనటుడితో అలాంటి సన్నివేశం చేయడమే ఇష్టం ఉండదు.అలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నాడు బాలివుడ్ నటుడు నవాజోద్దిన్ సిద్దిఖి

పాపం తనతో ముద్దు సన్నివేశాలు చేయడం హీరోయిన్లకి ఇష్టం లేదని తన బాధ చెప్పుకుంటున్నాడు నవాజ్.

తన కొత్త చిత్రం ‘బాబుమొశాయ్ బందూక్ బాజ్’ లో గాఢమైన చుంబన దృశ్యాలు ఉన్నాయి.

అయితే ఇప్పుడున్న బిదితా బాగ్ లో ఎలాంటి ఇబ్బంది రాలేదు కాని, తనకన్నా ముందు ఈ చిత్రంలో కథానాయిక చిత్రంగద సింగ్ నవాజ్ తో ముద్దు సీన్లు చేయలేక సినిమా వదిలేసింది అంట.అప్పటికి సగం షూటింగ్ పూర్తి అయ్యింది.అప్పటికే కొన్ని ముద్దు సీన్లు చేసారు కూడా.

కాని ఇప్పటివరకు తీసిన ముద్దు సీన్లు చాలు అని, ఇక చేయడం తనవల్ల కాదని ప్రాజెక్ట్ మధ్యలోంచే వెళ్ళిపోయింది

ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్న నవాజ్, తనతో రొమాంటిక్ సన్నివేశాలకు ఇష్టపడని మరో హీరోయిన్ గురించి కూడా చెప్పాడు.గ్యాంగ్స్ ఆఫ్ వసేపూర్ చేస్తున్నప్పుడు తనతో ముద్దు సన్నివేశాలు ఉంటాయని తెలిసిన హీరోయిన్ హుమా ఖురేషి, కావాలని తనని అన్నయ్య అని పిలవడం మొదలుపెట్టిందట.

అన్నయ్య అన్న అమ్మాయితో రొమాంటిక్ సీన్లు ఎలా చేయగలను, అందుకే స్క్రిప్టు లోంచి అవి తీయించేసాను అంటూ ఆ చేదు జ్ఞాపకాలని పంచుకున్నాడు నవాజ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube