పవర్ స్టార్ రికార్డుని సులువుగా బద్దలు కొట్టిన సూపర్ స్టార్

రికార్డులున్నవి బద్దలవ్వడానికే.అవి చేతులు మారతాయి అంతే.

 Mahesh Babu Beats Pawan Kalyan By Huge Margin-TeluguStop.com

ఓ సినిమాకి పవన్ చేతిలో ఉంటే, మరో సినిమాకి మహేష్ చేతిలోకి వెళ్ళిపోతాయి.ఒకప్పుడు కేవలం ఏ సినిమా ఎన్ని సెంటర్లు ఆడింది అని మాత్రమే రికార్డులు చూసేవారు.

ఆ తరువాత కలెక్షన్లు బయటకి చెప్పడం మొదలుపెట్టారు.ఆ తరువాత వందరోజులు, ఆ తరువాత మొదటిరోజు, మొదటి వారం, ఫుల్ రన్ రికార్డులు.

ఇక సినిమా పెర్ఫార్మెన్స్ మీద మాత్రమే కాదు, మిగితా విషయాల మీద కూడా రికార్డులు పుడుతున్నాయి.ఇంటర్నెట్ వచ్చాక, యూట్యూబ్ రికార్డులు.

ఇక ప్రీ రిలీజ్ రికార్డులు, శాటిలైట్ హక్కుల రికార్డులు కొత్త ట్రెండ్.

స్పైడర్ తెలుగు, హిందీ మరియు మలయాళం కలిపి, శాటిలైట్ హక్కులు 32 కోట్లకి అమ్ముడుపోయాయి.

దీన్ని చూసుకొనే ప్రిన్స్ అభిమానులు జబ్బలు చరుచుకున్నారు.ఇక పవన్ తమిళ వెర్షన్ లేకుండానే ఆ రికార్డు కొట్టేసాడు.

త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా శాటిలైట్ తెలుగులో 21 కోట్లకి, హిందీలో 11 కోట్లకి అమ్ముడుపోయింది.ఇది మీకు తెలిసిందే.

ఇక మహేష్ తదుపరి చిత్రం భరత్ అనే నేను 23-25 కోట్లకు తెలుగులో అమ్ముడుపోయేలా ఉంది.అంటే కొత్త రికార్డు.

ఇది కూడా మీకు తెలిసిందే.మరి భరత్ అనే నేను హిందీ వెర్షన్ శాటిలైట్ ధర ఏంతో తెలుసా? ఏకంగా 16 కోట్లు.

అంటే తెలుగు + హిందీ శాటిలైట్ హక్కులు 39-41 కోట్లకు అమ్ముడుపోతున్నాయి అన్నమాట.పెద్ద మార్జిన్ తోనే రికార్డు కొట్టేసాడు సూపర్ స్టార్.అయితే ఇక్కడ గుర్తు ఉంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, మహేష్ కి తమిళ శాటిలైట్ మార్కెట్ కూడా ఉంటుంది.భరత్ అనే నేను తమిళ హక్కులు అమ్మితే, ఈ లెక్క ఇంకా పెరుగుతుంది.

ఎక్కడికో వెళ్ళిపోతోంది కదా తెలుగు సినిమా.శాటిలైట్ హక్కులతో కూడా ఓ సినిమా తీసేయొచ్చు.

అంతలా పెరిగిపోయింది మన మార్కెట్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube