పవన్ కంటే విజయ్ 20 రేట్లు నయం అంటున్న స్టార్ డైరెక్టర్

అర్జున్ రెడ్టి మేనియా తెలుగువాళ్ళని అల్లుకుంది‌.సినిమా విడుదలైన థియేటర్ల లెక్కలకు, వస్తున్న కలెక్షన్లు చూస్తోంటే ట్రెడ్ వర్గాలు షాక్ కి గురవుతున్నాయి.

 పవన్ కంటే విజయ్ 20 రేట్లు నయం అం-TeluguStop.com

ఓ శివ, ఓ ఖుషి, ఓ పోకిరి మాదిరిగా యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా, కేవకం కమర్షియల్ గా కలెక్షన్లు మాత్రమే కాదు, విమర్శకుల ప్రశంసలను కూడా పొందుతోంది‌.తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ పెద్ద మార్పు తీసుకురావాలని, కథలని చెప్పే విధానంలో కత్త పంథా అలవాటు కావాలని సినీపెద్దలు కోరుకుంటున్నారు.

ఇక విజయ్ దేవరకొండ కొత్త స్టార్ అయిపోయాడు.ప్రతీనోట అర్జున్ రెడ్టి ముచ్చట్లే, విజయ్ గురించి పొగడ్తలే.

ఇక రామ్ గోపాల్ వర్మ అయితే లిటరల్ గా విజయ్ భజన చేస్తున్నారు‌.

స్లో మోషన్ షాట్స్ లేకుండా, గాల్లోకి ఎగిరే విలన్లు లేకుండా, నస పెట్టే పంచ్ డైలాగులు లేకుండా, హీరోగా అనిపిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

ఇలా ఇంకెవరు అనిపించలేదు.విజయ్ లో ఒక అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడు అంటూ అక్కడితో ఆగని వర్మ, విజయ్ ని పవన్ కళ్యాణ్ కంటే ఎత్తులో కూర్చోబెట్టారు.“విజయ్ గురించి చెప్పాలంటే, అతను లుక్స్, ఛార్మీషా పరంగా పవన్ కళ్యాణ్ కంటే 10 రేట్లు బాగుంటాడు, నటన విషయంలో పవన్ కళ్యాణ్ కంటే 20 రేట్లు నయం.విజయ్ నటనలో సహజత్వాన్ని దృష్టిలో పెట్టుకోని అతనికి ” రియల్ పవర్ స్టార్” అనే బిరుదని ఇవ్వాలి.రియల్ పవర్ స్టార్ విజయ్ దేవరకొండ ” అంటూ తన స్టయిల్లో స్టేట్మెంట్స్ ఇచ్చారు వర్మ.

వర్మ కామెంట్స్ అల్రెడి నిప్పు వెలిగిస్తే, దానికి పెట్రోల్ అందించారు క్రిటిక్ కత్తి మహేష్.

ఆర్జీవి అన్నట్లు పవన్ కళ్యాణ్ కంటే విజయ్ దేవరకొండ 10 రేట్లు నయం అనే మాటతో తను ఏకిభవిస్తున్నానని, విజయ్ లాగా ఒక్క సీన్ కాదు కదా, ఒక లుక్ ఇవ్వడం కూడా పవన్ కళ్యాణ్ వల్ల కాదంటూ నిప్పులో పెట్రోల్ పోసారు కత్తి‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube