నా నడుముతో అతనేం చేస్తున్నాడో అర్థం కాలేదు అంటున్న ఇలియానా

భారతీయ సినిమాల్లో, ముఖ్యంగా దక్షిణాది సినిమాల్లో, అమ్మాయిల నడుము భాగానికి ఇచ్చే ప్రాముఖ్యత కాస్త విచిత్రంగా ఉంటుంది.హీరోయిన్ ఇంట్రడక్షన్ షాట్ లో నడుము చూపిస్తారు, పాటల్లో హీరోయిన్ నడుముకి క్లోజప్ షాట్స్ పెడతారు, సినిమాలో ఓ రొమాంటిక్ కావాలి అంటే చాలు, నడుము భాగాన్ని, నాభిని కెమెరా చూపించాల్సిందే‌.

 Ileana Hits Hard On Waistnavel Obsession 1-TeluguStop.com

ఇదంత ఒక ఎత్తైతే, హీరోయిన్ నడుముని పూలతో, పండ్లతో, శంఖంతో కొట్టడం, దానిపై తేనే, నూనే పోయడం వంటి చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తారు దర్శకులు.దీనిపై తాప్సి రాఘవేంద్రరావుని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఎలాంటి వివాదాన్ని సృష్టించాయో మీరు చూసారు.

ఇలియానా కూడా ఓసారి స్పందించింది.అయినా సరిపోలేదేమో, ఈసారి ఇంకొంచెం ముక్కుసూటిగా మాట్లాడుతూ మళ్ళీ కామెంట్ చేసింది

తన తొలిచిత్రం దేవదాసుని మాట్లాడుతూ “ఓ దర్శకుడు శంఖాన్ని నా నడుముపై వేస్తానన్నాడు.

అలా ఎందుకు, బరువుగా ఉంటుందిగా అన్నాను.పర్లేదు, అందంగా ఉంటుంది షాట్ అంటూ నా నడుముపై శంఖం వేసారు.

పదే పదే నా నడుముపై క్లోజప్ షాట్స్ తీసారు.ఇలా ఎందుకు చేస్తున్నారు అంటే అందంగా ఉంది నీ నడుము అన్నారు‌.

అసలు నా నడుముతో అతనేం చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు.అందులో ఏం అందం ఉందో అర్థం కాలేదు.

కొన్ని సినిమాల్లో చాలా దారుణమైన యాంగిల్స్ పెట్టి నా శరీరాన్ని చూపించారు.బాధగా అనిపించేది, అలాగే నవ్వు కూడా వచ్చేది.

ఏమో, నా శరీరాన్ని చూడటానికే థియేటర్ కి వచ్చే జనాలు ఉంటారేమో అనుకునేదాన్ని.ఇలా కేవలం దక్షిణాది ఇండస్ట్రీలోనే జరుగుతుంది అని వేలు ఎత్తి చూపలేను.

బాలివుడ్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి.కాని ఇప్పుడు అలాంటి పాత్రలు నేను చేయలేను.

నా పాత్ర కథలో భాగంగా ఉండాలి.కేవలం గ్లామర్ బొమ్మలా కాదు” అంటూ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది ఇలియానా‌.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube