తెలుగు స్టాప్ .కామ్ రీడర్స్ కు దీపావళి శుభాకాంక్షలు

వెలుగుల పండుగ దీపావళి సందడి మొదలయింది.టపాసుల చప్పుళ్లు, పిల్లల కేరింతలతో ఊళ్లలన్నీ మార్మోగుతున్నాయి.

 About D-TeluguStop.com

తెలుగు లోగిళ్లు కొత్త శోభ సంతరించుకున్నాయి.ఈ తెల్లవారుజాము నుంచి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

భూమి మీద ఒకప్పుడు అందరికీ వెలుగు అందకుండా దూరం చేసిన వాడొకడు ఉండేవాడట.అందుకే వాడు చనిపోతే అందరూ కరువుతీరా దీపాలు వెలిగించుకుని తమ సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు.

ఎన్నో వరుసలలో దీపాలు వెలిగించుకున్నారు కనుక ఈ వేడుకని దీపావళి అన్నారు.ఈ దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజిస్తారు.అయితే ఈసారి దీపావళి సందడి తక్కువగానే ఉందని చెప్పాలి.సమైక్య ఉద్యమం, ధరల పెరుగుదల, ఆర్థిక అనిశ్చితి కారణంగా పండుగ శోభ తగ్గింది.మరోవైపు బాణాసంచా ధరలు చుక్కలనంటుతుండడంతో వాటిని కొనేందుకు ప్రజలు భయపడుతున్నారు.కొనుగోళ్లు తక్కువగా ఉండడంతో వ్యాపారులు ఊసూరుమంటున్నారు.

అయితే అన్నివర్గాలు వారు ఉన్నంతలో పండుగ జరుపుకునేందుకు ఆసక్తి చూపుతుండడం విశేషం.టపాసులు కాల్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రతలు : దీపావళి పండుగ వచ్చిదంటే చాలు చిన్న పిల్లల సంతోషానికి హద్దులు ఉండవు.ఈ పండుగ అంటే ముందుగా గుర్తుకొచ్చేది టపాసులు.ఇవి ఎప్పుడు కాల్చుదామా అని ఎదురు చూస్తుంటారు.రాత్రి కాగానే పిల్లలు, పెద్దలు టపాసులు కాల్చడం ప్రారంభిస్తారు.ఒక్కోసారి అజాగ్రత్తగా ఉండడం వల్ల కొన్ని ప్రమాదాలు జరుగుతాయి.

ఈ ప్రమాదాలలో కొంతమంది కంటి చూపు పొగొట్టుకోగా మరికొంతమంది వికలాంగులయ్యారు.ప్రమాదం జరిగాక బాధపడే కన్నా ముందే తగు జాగ్రత్తలు తెసుకొంటే మంచిది .ముఖ్యం గా బాణాసంచా కాల్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.టపాసులు అంటించేందుకు పొడుగాటి అగర్‌బత్తీలు వాడాలి.

బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోవాలి.పాలిస్టర్ , సిల్క్.

దుస్తులు వాడరాదు.చెవిలో దూది పెట్టుకోవాలి కళ్లకు అద్దాలు పెట్టుకుని కాల్చితే మేలు.

చిన్న పిల్లలు పేల్చే సమయంలో పెద్దలు దగ్గర ఉండాలి.పేలని టపాకాయల జోలికి వెళ్లరాదు.

ప్రమాదం జరిగితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.కాలిన గాయానికి నీళ్లు తగలకూడదు సాధ్యమైనంతవరకు విశాలంగా ఉండే ప్రదేశాల్లోనే టపాసులు కాల్చుకోవడం మంచిది.

అది చిన్న ప్రమాదం కావచ్చు.పెద్ద ప్రమాదం కావొచ్చు.

ఏ చిన్న అపశృతికి అవకాశం లేకుండా పూర్తి చేసుకుంటేనే పండగ అనుభూతులు తీపి గుర్తు గా మిగిలిపోతాయి…సో.బీ కేర్ ఫుల్.

తెలుగు స్టాప్ .కామ్ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube