జయ జానకి నాయక నష్టాలు ఎంత, లై నష్టం ఎన్ని కోట్లో చూడండి

నితిన్ సినిమాలు నెగేటివ్ టాక్ తో కూడా మార్కేట్ విస్తరించని సమయంలో పది కోట్ల షేర్ అలవోకగా దాటేవి.హార్ట్ ఎటాక్ మీద పూరి జగన్నాథ్ బ్రాండ్ పనిచేసింది అనుకుందాం, మరి నెగెటివ్ టాక్ ఉన్న చిన్నదానా నీకోసం సినిమాని మాత్రం లాగింది నితినే కదా.

 Loss Analysis Of Jaya Janaki Nayana And Lie 1-TeluguStop.com

ఇక మార్కెట్ కొద్దిగా విస్తరించగా త్రివిక్రమ్ అండతో 45 కోట్ల మార్కు చేరుకున్నాడు నితిన్.మరి అలాంటి మంచి మార్కెట్ ఉన్న హీరో సినిమా పట్టుమని పది కోట్లు దాటడానికి కూడా తంటాలు పడుతుందని ఎవరు ఊహించారు?

బోయపాటి శ్రీను అంటే తెలుగు రాష్ట్రాల్లో ఓ బ్రాండ్.మాస్ సెంటర్స్ లో ఆయనకీ కల్ట్ ఫాలోయింగ్ ఉంది.మాస్ ప్రేక్షకులు ఎగబడి చూస్తారు ఆయన సినిమాల్ని.అలాంటి బోయపాటి శ్రీను సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిన తరువాత కూడా సినిమా ఫ్లాప్ అవుతుందని ఎవరు ఊహించారు?

నితిన్ లై, బోయపాటి జయ జానకి నాయక, రెండూ భారి నష్టాల బాట పట్టాయి.అదేరోజు విడుదలై డివైడ్ టాక్ తో మొదలైన నేనే రాజు నేనే మంత్రి సూపర్ హిట్ స్టేటస్ వైపు దూసుకెళుతుండగా, ఈ రెండు సినిమాలు పంపిణిదారులకి చుక్కలు చూపిస్తున్నాయి.

ఏ సినిమాకి ఎంత నష్టం వస్తోందో చూడండి

బోయపాటి బ్రాండ్ వలన జయ జానకి నాయక సినిమాని ఏకంగా 34 కోట్లకు కొన్నారు పంపిణిదారులు.ఇందులో తెలుగు రాష్ట్రాల్లోనే 31 కోట్లు పెట్టారు.10 రోజుల్లో ఈ సినిమా రికవర్ చేసింది కేవలం 17 కోట్లు.వరల్డ్ వైడ్ గా 18 చిల్లర వచ్చాయి.

మహా అయితే ఇంకో మూడు – నాలుగు కోట్లతో రన్ ముగించేలా ఉంది ఈ సినిమా.అంటే 13-14 కోట్ల నష్టం అన్నమాట.

ఇక లై ఇంకా దారుణం.నితిన్ మార్కెట్ మీద భరోసాతో 24 కోట్లు పెట్టారు బయ్యర్లు.ఈ సినిమా తిపితిప్పి కొడితే 8.5 కోట్ల దాకా రాబట్టింది 10 రోజుల్లో.మాహా అయితే 10-11 కోట్లు అనుకుందాం ఫన్ రన్ లో.అంటే ఈ సినిమాకి కూడా 13-14 కోట్ల నష్టం వచ్చేలా ఉంది

ఈ రెండు సినిమాల కన్నా తక్కువ రేట్లకే అమ్మారు నేనే రాజు నేనే మంత్రి.18 కోట్లు బయ్యర్లు పెడితే, ఇప్పటికి 22 కోట్లు వచ్చాయి.ఆల్రేడి 4 కోట్ల లాభం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube