చంద్ర‌బాబు చాక‌చ‌క్య‌మే టీడీపీకి అండ‌

నంద్యాల ఉప ఎన్నిక ఫ‌లితంపై టీడీపీ ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది.ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు పాల‌న‌కు ఇది అద్దం ప‌ట్ట‌బోతున్నాయ‌ని విశ్లేష‌కులు స్ప‌ష్టంచేస్తున్నారు.

 Chandrbabu Political Expert 1-TeluguStop.com

ఇదే స‌మ‌యంలో ఫ‌లితం అటూఇటూ అయితే.శ్రేణుల్లో నిస్తేజం ఆవ‌రిస్తుంద‌నేది వాస్త‌వం.

ఇదే స‌మ‌యంలో పార్టీలో అంత‌ర్గ‌త పోరు తీవ్ర‌మ‌వుతుంది.మ‌రో ఏడాదిన్న‌ర‌లో ఎన్నిక‌లు రానున్న‌ త‌రుణంలో.

సీనియ‌ర్ల‌ను కాపాడుకోవాల‌న్నా.శ్రేణుల్లో ధైర్యం నింపాల‌న్నా నంద్యాల ఉప ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం అత్యంత కీల‌కంగా మారింది.

మరి ఈ స‌మ‌యంలో.పార్టీకి బ‌లం, బ‌ల‌హీన‌త ఎవ‌రంటే వెంట‌నే గుర్తొచ్చే పేరు సీఎం చంద్ర‌బాబు! ఎన్నో సంక్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్న ఆయ‌న చాక‌చ‌క్య‌మే ఇప్పుడు కీల‌కం!

నంద్యాల‌ ఉపఎన్నిక ఫలితాలపై పూర్తి ధీమాతో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ పోలింగ్‌ తరువాత కొంత డీలా పడినట్లు తెలుస్తోంది.

పెరిగిన పోలింగ్‌ తమకే అనుకూలమని చెప్పుకుంటున్నా… వారిలో ఏదో భయం ఆవహించింది.తమకు వ్యతిరేకమైతే ఎలా అన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి.ఎన్నికల సర్వే స్పెషలిస్ట్‌ లగడపాటి రాజగోపాల్‌ కూడా టిడిపిదే విజయమని చెబుతున్నారు.10శాతం ఓట్లతేడాతో టీడీపీ విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.ఒకవైపు గెలుపుపై ధైర్యం, మరోవైపు ఏదో అనుమానం వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.ఒకవేళ ఓడితే…ప్రజలకేం సమాధానం చెప్పుకోవాలో దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నారు నేత‌లు! దాదాపు రూ.1200కోట్లతో చేపట్టిన అభివృద్ధిపనులు, సంక్షేమపథకాలు, గృహనిర్మాణలు, అధికారం కూడా ఓటర్లలో ప్రభావం చూపించకపోతే.వీట‌న్నింటిపై పూర్తిగా సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

ఇప్పటికే కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకుల మధ్య ఉన్న విభేదాలు తీవ్రమవుతాయి.ఇక ఫిరాయించిన ఎమ్మెల్యేలు కూడా జారుకునే అవకాశం ఉంది.

ఇక మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నుంచి ముప్పు మరింత పెరుగుతుంది.ఇప్పటికే శల్యసారథ్యం చేస్తున్న బీజేపీ నేతలు మరింత విజృంభించే అవకాశం ఉంది.

ఇదిగాక ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా.టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తి చల్లారదనే వాద‌న‌ ప్రజల్లోకి వెళ్లిపోతోంది

రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందనేవారి మాటలకు ఈ ఫలితాలు బలాన్ని చేకూరుస్తాయి.

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్‌లో కూర్చుని ఆంధ్రాపై బండలేస్తున్న మేధావులు ఇకపై తమ మాటల తూటాలను మరింత ఎక్కువగా పేలుస్తారనడంలో సందేహంలేదు.ఈ వరుసలో చూస్తే నంద్యాల ఫలితాలు టీడీపీకి శరాఘాతంలా మార‌తాయి.ఇటువంటి ఎన్నికలు ఆపార్టీకి కొత్తమీ కాదు.పడడం… లేవటం.ఆ పార్టీకి మామూలే.గత ఎన్నికల ముందు కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నా చంద్రబాబు చాకచక్యంతో పార్టీని నిలబెట్టి అధికారంలోకి తెచ్చారు.చంద్రబాబు బలంతో మళ్లీ బలంగా పుంజుకోగలసత్తా ఆపార్టీకి ఉందంటున్నారు కార్య‌క‌ర్త‌లు!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube