ఏ రాశి వారికి ఏ సెల్ ఫోన్ కరెక్టో తెలుసుకుందాం

రాసి చక్రం ప్రకారం పేర్లు పెట్టుకోవటం , రంగు రాళ్ల ఉంగరాలను పెట్టుకోవటం, వివాహాలు చేసుకోవటం మరియు శుభకార్యాలు చేసుకోవటం వరకు మనకు తెలిసిన విషయమే.అయితే ఈ మధ్య కాలంలో జ్యోతిష్యులు ఉద్యోగం చేయటానికి ఏ రంగం బాగుంటుందో కూడా చెప్పుతున్నారు.ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల‌ను కూడా రాశుల ప్ర‌కార‌మే వాడాలని జ్యోతిష్యులు చెప్పుతున్నారు.12 రాశుల వారు వారి రాశిని బట్టి ఏ స్మార్ట్ ఫోన్ వాడాలో తెలుసుకుందాం

 Horoscope Matching Smart Phone 1-TeluguStop.com

మేష రాశి


ఈ రాశి వారికీ ఓపిక సహనం చాలా తక్కువగా ఉంటుంది.ఏ పనైనా చాలా స్పీడ్ గా జరగాలని కోరుకొనే మనస్తత్వం కలిగి ఉంటారు.అందువల్ల ఈ రాశివారు 6/8 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్స్ వాడితే మంచిది.

వీరికి ఈ మధ్యనే విడుదల అయిన వ‌న్ ప్ల‌స్ 5 స్మార్ట్‌ఫోన్ బెస్ట్ గా ఉంటుందని చెప్పవచ్చు

వృష‌భం


ఈ రాశివారు ప్రక్రుతి ప్రేమికులు.వీరు ఏ పని చేయాలన్నా ప్రణాళిక వేసుకొని రంగంలోకి దిగుతారు.

అంతేకాక వీరు ఉన్నతంగా అలోచించి పెద్ద పెద్ద లక్ష్యాలను సాధించాలనే తపన ఎక్కువగా ఉంటుంది.అందువల్ల వీరికి శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ఫోన్ బాగుంటుంది

మిథునం


ఈ రాశివారు తమ భావాలను ఇతరులకు చాలా సృజనాత్మకంగా చెప్పటంలో నేర్పరులు.

అలాగే వీరు నలుగురిలో ఉండటానికి కన్నా ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు.కాబట్టి ఈ రాశి వారు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్ ఫోన్ తీసుకుంటే బాగుంటుంది.

క‌ర్కాట‌కం


ఈ రాశివారు ఎక్కడకు వెళ్లిన ఈ పని చేసిన ఎక్కువ సౌకర్యం కోరుకుంటారు.అనవసరంగా ఆందోళనకు గురి కాకుండా మంచి ప్రణాళికతో ముందుకు సాగుతారు.

కాబట్టి ఈ రాశివారు గూగుల్ పిక్స‌ల్ ఫోన్‌ను తీసుకుంటే బాగుంటుంది

సింహం


ఈ రాశివారికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.అందరి కన్నా ముందుగా ఏక్కువ అప్డేట్స్ తెలుసుకోవాలనే ఆలోచనతో ఉంటారు.

అంతేకాక చాలా విలాసంగా ఉండాలని అనుకుంటారు.కాబట్టి ఈ రాశివారు హెచ్‌టీసీ యూ11 ఫోన్‌ను తీసుకుంటే బాగుంటుంది

కన్య


ఈ రాశివారు ఎక్కడకు వెళ్లిన నలుగురిలో ఉన్నా సరే చాలా సింపుల్ గా ఉండాలని కోరుకుంటారు.

ఆడంబరాలకు పోకుండా చాలా సింపుల్ గా జీవితాన్ని గడుపుతారు.కాబట్టి ఈ రాశివారు యావ‌రేజ్ మోడ‌ల్ అయిన మోటో జ‌డ్ ప్లే ఫోన్‌ను తీసుకుంటే బాగుంటుంది

తుల


ఈ రాశివారికి పుస్తకాలు చదవటం మరియు సంగీతాన్ని వినటం అన్నా చాలా ఆసక్తి ఉంటుంది.

కాబట్టి ఈ రాశివారు హెచ్‌టీసీ 10 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకుంటే మంచిది

వృశ్చికం


ఈ రాశివారు నలుగురిలో ప్రత్యేకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.అందరిలా కాకుండా విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు.కాబట్టి ఈ రాశివారికి బ్లాక్‌బెర్రీ పాస్ పోర్ట్ ఫోన్ అయితే బాగుంటుంది.

ధనస్సు


ఈ రాశివారిలో ఎక్కువ సృజ‌నాత్మ‌కత ఉండుట వలన నలుగురిలో విభిన్నంగా ఉండాలని కోరుకుంటారు.కాబట్టి ఈ రాశివారికి ఐఫోన్ 7 లేదా 7 ప్ల‌స్ అయితే బాగుంటుంది

మ‌క‌రం


ఈ రాశివారు ప్రతి విషయంలో వంద శాతం ఖచ్చితత్వంను కోరుకుంటారు.అంతేకాక నాణ్యతకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు.

కాబట్టి ఈ రాశివారు సోనీ కంపెనీకి చెందిన ఎక్స్‌పీరియా ఎక్స్‌జ‌డ్ ప్రీమియం ఫోన్‌ను తీసుకుంటే బాగుంటుంది

కుంభం


ఈ రాశివారు ఎక్కువగా వినోదాన్ని కోరుకొని ఉల్లాసంగా జీవించటానికి ఇష్టపడతారు.అంతేకాక వీరిలో ఊహాశక్తి కూడా ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఈ రాశివారు శాంసంగ్ గెలాక్సీ ఎస్‌8 ప్ల‌స్‌ను తీసుకుంటే మంచిది

మీనం


ఈ రాశివారికి కొత్త విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది.అలాగే అందరి కన్నా ముందుగా ఉండాలని ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉండాలని కోరుకుంటారు.

కాబట్టి ఈ రాశివారికి యాపిల్ ఐఫోన్ 7 ప్ల‌స్ ఫోన్ బాగుంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube