ఇలియానాపై లైంగిక దాడి

సినిమా వాళ్ళు అన్నాక వారికి ప్రైవేట్ లైఫ్ ఉండటం కష్టమైన విషయం.వారి ప్రతి అడుగుని మీడియా గమనిస్తూనే ఉంటుంది, అభిమానులు తెలుసుకుంటూనే ఉంటారు.

 Ileana Receives Misbehavior From A Male Fan-TeluguStop.com

వారు కాఫీ బాలేదు అన్నా, అది వార్తే.ఈరోజు నిద్రపట్టలేదు అన్నా వార్తే.

ఇలా వారి లైఫ్ పూర్తి పబ్లిక్ గా ఉంటుంది.అందుకే జనాల్లోకి రాలేకపోతారు.

ఇక సినిమా వారు జనాల్లోకి వస్తే, అందులోనూ హీరోయిన్లు వస్తే ఎలాంటి సంఘటనలు జరుగుతాయో మనకు తెలియనిది కాదు.కొంతమంది ఆకతాయిలు అదే అదనుగా అసభ్యంగా ప్రవర్తిస్తారు.

మాల్ ఓపెనింగ్స్ లో, పబ్లిక్ మీటింగ్స్ లో ఎంతమంది హీరోయిన్లపై అసభ్య తాకిడి జరగలేదు?

తాజాగా ఇలియానాకి కూడా ఇలాంటి ఓ చేదు అనుభవం ఎదురైంది.ఆ విషయాన్ని బయటపెడుతూ ఇలియానా ఇలా ట్వీట్ చేసింది.“మనం ఓ పాడు ప్రపంచంలో బ్రతుకుతున్నాం.నేను ఒక పబ్లిక్ ఫిగర్ (సెలబ్రిటీని).

నాకు వ్యక్తిగత జీవితం, సీక్రెట్ లైఫ్ ఉండదని అర్థం చేసుకోగలను.కాని దానర్థం ఒక మగవాడు నాతొ అసభ్యంగా ప్రవర్తించాలి అని కాదు.

అలాంటి చేష్టలకి అభిమానం అనే రాను పూయవద్దు.నేను ఎవరైతే ఏంటో, చివరకి అందరిలాంటి ఓ మహిళనే” అంటూ ఆవేశం, ఆవేదన వ్యక్తపరిచింది ఇలియానా.

మరి ఆ మగ అభిమాని ఎవరో, ఇలాంటి సంఘటన ఎప్పుడు, జరిగ్గిందో మాత్రం చెప్పలేదు ఇలియానా.హీరోయిన్లపై ఇలాంటి అసభ్యకరమైన దాడులు జరగడం ఇదేమి కొత్త కాదు.

మన టాలివుడ్ లో కూడా సమంత, కాజల్, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లకి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.

ఇక సినిమాల విషయానికి వస్తే, ఇలియానా కొత్త చిత్రం ముబారకాన్ మంచి విజయాన్ని సాధించింది.

ఇల్లి బేబి అజయ్ దేవగన్ తో నటించిన బాద్శాహో సెప్టంబర్ 1వ తేదినా ప్రేక్షకుల ముందుకి రానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube