ఇలా చేస్తే ఇంటిలో నుంచి బల్లులు రెండు నిమిషల్లొ మాయం

చాలా మంది బొద్దింకలు,బల్లులను చూసి భయపడుతూ ఉంటారు.దానికి బదులు అవి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే భయపడే సమస్య ఉండదు.

 How To Get Rid Of Lizards-TeluguStop.com

అయితే మన ఇంటిలో గోడల మీద తిరిగే బల్లులు మనకు మేలే చేస్తాయి.ఎలా అంటే మన ఇంటిలో ఉండే క్రిమి కీటకాలను ఎప్పటికప్పుడు తినేస్తూ ఉంటాయి.

అయితే బల్లులు మన మీద పడతాయనే భయం ఒక పక్క మరో పక్క తినే ఆహారాల మీద పడి ఆహారాలు కలుషితం అవుతాయని బల్లులు లేకుండా ఉంటేనే బెటర్ అని అన్పిస్తుంది.

ఇల్లు శుభ్రంగా లేకుండా దుమ్ము ధూళి తో నిండి ఉంటే మనం ఏరి కోరి బల్లులను ఆహ్వానించినట్టే.

అందువల్ల ముందుగా ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

బల్లులకు వేడి వాతావరణంలో ఉంటాయి.

అందువల్ల ఒక స్ప్రే బాటిల్ లో చల్లని వాటర్ పోసి బల్లుల మీద స్ప్రే చేస్తే బల్లులు పారిపోతాయి.

బల్లులకు వెల్లుల్లి వాసన అసలు గిట్టదు.

అందువల్ల నీటిలో వెల్లుల్లి రసాన్ని కలిపి ఒక స్ప్రే బాటిల్ లో పోసి బల్లులు ఉన్న ప్రదేశంలోను మరియు గది నలుమూలల స్ప్రే చేయాలి.వెల్లుల్లి వాసనకు బల్లులు బయటకు వెళ్లిపోతాయి.

బల్లులకు కర్పూరం వాసన కూడా గిట్టదు.అందువల్ల బల్లులు బాగా తిరిగే ప్రదేశంలో కర్పూరం బిళ్ళలు ఉంచితే ఆ సువాసనకు బయటకు వెళ్లిపోతాయి.

నెమలి ఈకలను బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశంలో పెడితే నెమలి ఈకలను చూసి ఇంటిలోకి రావు

కోడిగుడ్డు పెంకుల నుండి వచ్చే వాసన కూడా బల్లులకు గిట్తదు.అందువల్ల గదిలో అక్కడక్కడా పెడితే వాటి వాసనకు బల్లులు బయటకు వెళ్ళిపోతాయి.

అయితే గోడిగుడ్డు పెంకు పచ్చివాసన పొతే వాటిని మార్చాలి.

కొంచెం వోడ్కా తీసుకుని అందులో ఎసెన్షియల్ ఆయిల్ ని కలపాలి.

ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్ లో పోసి గదిలో స్ప్రే చేస్తే బల్లులు ఆ వాసనకు బయటకు వెళ్లిపోతాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube